చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక ఉన్న ఓ బలమైన వ్యూహంలో ఓటర్ల జాబితా ట్యాంపరింగ్ కూడా ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి . దీనికి కారణం చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ క్యాడర్ అంతా అటు వైపు దృష్టి పెట్టగా మొత్తం కింది స్థాయి వ్యవస్థ టీడీపీ ఓట్లపై పడిందని చెబుతున్నారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన ఓట్లు డబ్లింగ్ అయినా అధికారులు పట్టించుకోలేదు. దొంగ ఓట్లను తొలగించలేదు. కానీ టీడీపీ ఓట్లు తీసేయడానికి వైసీపీ నేతలు ఫామ్ 7 ఇస్తే మాత్రం ఆఘమేఘాలపైల ఓట్లు తీసేసే చర్యలు చేపట్టారు.
వైసీపీ వైనాట్ 175 వెనుక అతి పెద్ద కుట్రఉందని రాజకీయ నేతలు ముందు నుంచీ అనుమానిస్తున్నారు . ప్రతీ నియోజకవర్గంలో కనీసం పది వేల టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేస్తే గెలుపు అనేది రాదని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకారమే సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పకడ్బందీ ఆపరేషన్ జరుగుతోంది. ఆయన నేతృత్వంలో ఓ టీమ్ ఏర్పాటయింది. ఐ ప్యాక్… వాలంటీర్ల ద్వారా వచ్చే సమాచారంతో… ఎక్కడెక్కడ ఓట్లు తీసేయాలో ప్రణాళిక రెడీ చేసుకుని ఆ ప్రకారం ఫామ్ సెవన్ లతో హోరెత్తించారు. ల
ఈ విషయంపై దుమారం రేగడం.. పర్చూరు నుంచి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కోర్టుకు వెళ్లడంతో అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకున్నారు. చివరికి నలుగురు పోలీసులపైనా వేటు వేశారు . కానీ అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈసీ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై నిషేధం విధించారు. అయినా ఎడాపెడా బదిలీలు సాగుతున్నాయి. ఓటర్ల జాబితా ఇరవై ఏడో తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత ఎంత రచ్చ జరుగుతుందో చూడాల్సి ఉంది.