మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా.. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. పదిహేనేళ్లలో కుల, మత రాజకీయాలతో పాలన చేయడమే కానీ.. ప్రజల బతుకుల్ని బాగు చేసే… భారీ కార్యక్రమాన్ని … బీజేపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టలేదు.
మధ్యప్రదేశ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రైతు వర్గమంతా తీవ్ర అసంతృప్తిలో ఉంది. పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 2017లో రైతులు నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు రైతులు మరణించారు. ఆ కాల్పుల ఘటన చౌహాన్ ప్రభుత్వానికి పరాజయం తెచ్చి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
రైతులకు గిట్టుబాటు ధరల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓ పథకం పెట్టంది. అందులోనూ భారీ అవినీతి చోటు చేసుకుంది. వ్యాపారులకు, ధనిక రైతులకే ఉపయోగపడుతోంది. నిరుద్యోగ సమస్య మధ్యప్రదేశ్‌లో చాలా ఎక్కువగా ఉంది. 53 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులే… పరిశ్రమలు లేవు.. తెచ్చే ప్రయత్నాలు కూడా.. చౌహాన్ చేయలేదు. వ్యాపం కుంభకోణం , పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల భారం.. ప్రజలపై తీవ్రంగా ఉంది. వారు ఆగ్రహావేశాలని దాచుకోవం లేదు. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏప్రిల్2వ తేదీన నిర్వహించిన బంద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు మరణించాడు. నిమ్న వర్గాలైన తమను అంతగా పట్టించుకోలేదని ఎస్సీ, ఎస్టీలు బలంగా భావిస్తున్నారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకమయ్యారు.
మెజారిటీ ప్రజలు పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాజస్థాన్ కంటే.. మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువ ప్రజావ్యతిరేకత ఉందన్న సూచనలు ఉన్నాయి. కానీ.. బీజేపీ అనుకూల మీడియా మాత్రం.. హోరాహోరీ పోరు ఉందన్న ప్రచారం తెచ్చి పెట్టాయి. నేడు జరగనున్న పోలింగ్‌లో మాయావతి నాయకత్వంలో బీఎస్పీ పార్టీ కాంగ్రెస్ఓట్లను చీల్చడం తమకు లాభించే అంశమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో 45 శాతం మంది ఉన్న ఆదివాసీల్లో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. సర్వేలు ఎలా ఉన్నా.. మధ్యప్రదేశ్‌లో ఈ సారి కాంగ్రెస్‌కే ఎడ్జ్ ఉందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.