నన్ను అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచుకుంటూంటే నేను మాత్రం ఎందుకు సుద్దపూసలా ఉండాలని అనుకున్న వెంకటరెడ్డి అనే పెద్ద మనిషి.. వారిచ్చిన కమిషన్ల కంటే ఎక్కువ కొట్టేయడానికి వేసిన ప్లాన్ ఇప్పుడు ఏపీ ఏసీబీ అధికారులకు మైండ్ బ్లోయింగ్ గా మారింది. వైసీపీ హయంలో ఇసుక, గనులు అన్నీ ఈ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ వెంకటరెడ్డి చేతుల మీదుగానే దోపిడీ చేశారు. ఎప్పుడైనా ఆరోపణలపై ప్రెస్మీట్లు పెడితే మన ప్రభుత్వం మన ప్రభుత్వం అనేవాడు. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆయన లీలలన్నీ వెలగులుకి వస్తున్నాయి.
తనను అడ్డం పెట్టుకుని అందరూ దోచుకుంటూంటే తాను మాత్రం ఎందుకు బిగ్ ప్లాన్ చేయకూడదని ఓ బిగ్ ప్లాన్ వేశారు. ఒక్క సారి ఓ మూడు వందల కోట్లు కొట్టేయడానికి ఆ ప్లాన్. జగన్ రెడ్డి ఓ సర్వే స్కీమ్స్ ప్రారంభించి దానికి రాళ్లు పాతాలనుకున్నారు. ఆ రాళ్లను కట్ చేయడానికి యంత్రాలు అవసరం అని.. గనుల శాఖతో కొనిపించాలనుకున్నారు. మామూలుగా ఆ యంత్రాలు రాజస్తాన్లో మూడుకోట్లకు దొరుకుతాయి. కానీ చైనా నుచి పదిహేను కోట్లకు తెప్పించేలా బినామీ సంస్థను రంగంలోకి దిగించారు.
ఒక యంత్రాన్ని తెప్పించారు కూడా. కానీ తర్వాత పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు ఆయన స్కెచ్ అంతా వెలుగులోకి వచ్చింది. సాక్ష్యాలతో సహా అవి బయటకు వచ్చాయి. ఈ అవినీతిలో తమకు ఎలాంటి వాటా లేదని గనుల శాఖలో ఆయన కింద ఉన్న వారంతా నిజాలు చెప్పేశారు. దాంతో వెంకటరెడ్డి నిండా మనిగిపోయారు. ఈ కటింగ్ ఎడ్జ్ కరప్షన్ టెక్నాలజీ చూసి… ఏసీబీ అధికారులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది.
విచిత్రం ఏమిటంటే… ఈయనను అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్న వైసీపీ నేతల్లో ఒక్కరు కూడా మద్దతుగా మాట్లాడటం లేదు.