తూ.గో జిల్లా పర్యటనలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న తీరు జగన్కు మైనస్ అవుతుందని … వైసీపీ అధినేత శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని నర్మగర్భంగా ఆయన ఈ ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ను అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశానన్నారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని.. నాడు కాంగ్రెస్ జగన్ను జైలుకు పంపడం వల్ల జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్న పార్టీలు సెల్ఫ్ గోల్స్ చేసుకుంటాయన్నారు.
చంద్రబాబు ఆనపర్తి పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో ఎవరికీ స్పష్టత లేదు. హైకోర్టులో ఉన్న జీవో నెంబర్ వన్ ను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నామని పోలీసులు ప్రకటించారు. అయితే ముందుగా పోలీసులు అనుమతి ఇచ్చి తర్వాత రోజు రద్దు చేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం.. ఇలా రాజకీయంగా ఇ బ్బంది పెట్టాడనికే చేశారన్న కారణంగా అనుకున్న ప్రదేశంలోనే ససభ నిర్వహించారు. కానీ అంత ఈడీగా ఈ సభ జరలేదు. పోలీసులు ఎంత ఓవరాక్షన్ చేయాలో అంతా చేశారు. చివరికి.. పోలీసులు రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ట్రాక్టర్లను అడ్డం పెట్టారు. కానీ చంద్రరబాబు నడుచుకుంటూ ఆనపర్తికి వెళ్లి సభ నిర్వహించారు.
ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని విపక్ష పార్టీల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం ఏమిటన్న చర్చ జరుగుతోంది. పోలీసులు ప్రైవేటు సైన్యంలా మారి.. వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు వ్యవస్థ పనితీరుపై మచ్చపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.