రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యానని చెప్పుకునే ఉండనల్లి జగన్‌ను విమర్శిస్తున్నట్లుగా ప్రెస్మీట్లు పెట్టి ఆయనకు సలహాలిస్తూ ఉంటారు. అవి జగన్ తీసుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ వైఎస్ ఆత్మీయ మిత్రునిగా ఆయన కుమారునికి వీలైనంత ఉడతా భక్తి సలహాల సాయం చేయడంలో ముందున్నారు. జగన్ ఆయనను పట్టించుకకపోయినా ఆయన జగన్ ఇబ్బందుల్లో ఉన్నారు అనుకున్నప్పుడల్లా ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. తాజాగా మరోసారి అలా మీడియా ముందుకు వచ్చారు.
పోలవర గురించి ప్రస్తుతం రచ్చ జరుగుతోంది. గత మూడేళ్లుగా పోలవరాన్ని పక్కన పెట్టడమే కాకుండా రివర్స్ టెండర్ల పేరుతో రచ్చ చేసి.. ఇప్పుడు పోలవరం పరిహారం మా వల్ల కాదని జగన్ చెతులెత్తేసిన అంశం ప్రజల్లోకి వెళ్తోంది . దీనిపై ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పిన మంత్రి అంబటి రాంబాబుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ అభినందనలు తెలిపారు. తాను బతికి ఉండగా పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం లేదన్నారు. గతంలో టీడీపీ నేతలెవరూ ఇలా చెప్పలేదన్నారు.
పోలవరం నిర్మాణంలో భాగం అయిన బావర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఏమీ తెలియదా? అని ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చిన నష్టానికి బాధ్యులెవరో నిర్థారించాలని, తప్పు ఎవరిదో సీఎం జగన్ , మంత్రి అంబటి చెప్పాలన్నారు. ఆనాడు డయాఫ్రమ్ వాల్ కట్టాలని చెప్పినోళ్లే.. ఇప్పుడు దాని వల్లే నష్టం జరుగుతుందని అంటున్నారని, పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి జగన్‌కు సూచించారు. పలు అంశాలపై ఉండవల్లి మాట్లాడినప్పటికీ.. పోలవరం విషయంలో ప్రజల విమర్శల నుంచి బయటపడటానికి ఏం చేయాలో జగన్‌కు ఆయన సలహాలిస్తున్నట్లుగా ప్రెస్‌మీట్ సాగింది. ఎప్పుడూ అదేలా ఉంటుంది . అయితే జగన్‌కు ఇబ్బంది అనిపించినప్పుడల్లా.. టీడీపీ కూడా అలాగే చేసిందని.. రెండూ ఒకటేనని చెప్పడానికి ఆయన తాపత్రయ పడతారు. ఇవాళ కూడా అదే జరిగింది.