స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో రూపాయి అవినీతి చూపించలేక .. తప్పుడు ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్న సీఐడీని కాపాడేందుకు అప్రకటిత స్వయం మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ రంగంలోకి దిగారు. కేసును సీబీఐ లేదా ఈడీతో విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే సీఐడీకి చేతకావడం లేదని ఆయన నేరుగా చెప్పినట్లయింది. ఇప్పుడు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నారో కానీ తెర వెనుక చాలా జరుగుతోందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో సీఐడీ కనీస ఆధారాలు సేకరించలేదు. ఆధారాలున్నాయని చెప్పి రాత్రికి రాత్రి అరెస్టు చేయించడమే కాదు రిమాండ్ కూడా విధించేలా చేశారు. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు..ఈ కేసులో చంద్రబాబుకు ఎలా లింక్ అనే ప్రాథమిక ఆధారాలు కోర్టులో చూపించాల్సి ఉంది. క్వాష్ పిటిషన్ పై విచారణలో చంద్రబాబుకు సంబంధం ఉందని ఎలాంటి డాక్యుమెంట్లు లేవని ప్రభుత్వ లాయర్ నేరుగా చెప్పారు. నిధులు మళ్లించారని వాదించిన లాయర్.. దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడో చెప్పలేకపోయారు.
ఇలాంటి సమయంలో ఉండవల్లి సీఐడీని కాపాడేందుకు… ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని పిటిషన్ వేశారు. నిజానికి ఈ కేసులో అసలు సీఐడీ విచారణ ప్రారంభమవడానికి కారణం ఈడీ విచారణ. ఈడీ కేసులు పెట్టిందని అందుకే తాము కూడా పెట్టామని.. నిధులు మళ్లింపు జరిగిందని సీఐడీ వాదిస్తోంది . మరి కొత్తగా ఈడీ ఏం చేస్తుందని … ఉండవల్లి అనుకుంటున్నారో. న్యాయవ్యవస్థతో ఎలా ఆడుకోవాలో జగన్ రెడ్డి క్యాంప్‌నకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదేమో ?