వైసీపీలో చేరుతారనుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావిగానే ఉంటూ తన రాజకీయ అజెండా అమలు చేయాలని అనుకున్నారేమో కానీ.. మీడియా ముందుకు వచ్చేశారు. పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తారు. ఏపీకి పవన్ కల్యాణ్ ఆశాజ్యోతిగా భావిస్తున్నాననని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన హామీలను కేంద్రం నుంచి పవన్ సాధించాలని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించాలని.. అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశాన్ని ప్రస్తావించాలని అంటున్నారు.
అయిపోయిన పెళ్లికి మేళాలు వాయించి..ఎవరో ఒకరి మెడలో గంటలు కట్టాలని ఉండవల్లి ఉబలాటపడుతూ ఉంటారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం ఆయనకు ఇవేమీ గుర్తుండవు. మార్గదర్శి మీద అయితే జగన్ కోసం తెగ పోరాడతారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ సాధించాలంటూ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా జగన్ ను ప్రశ్నించలేదు. ఇప్పుడు మాత్రం నెలకోసారి వచ్చేస్తున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ .. వైసీపీలో చేరిపోతే ఎవరికీ అబ్జెక్షన్ ఉండదు. కానీ ఇలా మేధావి ముసుగేసుకుని పవన్ ను పొడుగుతూ కూటమిలో చిచ్చు పెట్టాలనుకునే ప్రయత్నాలు చేస్త ఇంకా కుహనా మధావి అవుతున్నారు.
పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో ఉండవల్లి మేధావు తనానికి గౌరవం ఇచ్చారు. దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఇప్పుడు పవన్ ను దెబ్బకొట్టడానికి చిత్రమైన ఎత్తులు వేస్తున్నారు. ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో కానీ ఆయన అతి తెలివి రాజకీయం మాత్రం .. అన్ని పార్టీలకూ తెలుసు.