అభిరామ్… అతనో రాక్‌స్టార్. ఓ రాక్‌బ్యాండ్‌కి లీడర్ కూడానూ! రాక్‌స్టార్ అంటే… అతను పాడే పాటలు ఎలా ఉండాలి? ప్రేక్షకులు ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనట్టు ఉండాలి కదూ! అచ్చంగా అటువంటిS పాటల్నే అందించారు దేవిశ్రీ ప్రసాద్. సాంపిల్ అన్నట్టు ముందు రెండు పాటల్ని రిలీజ్ చేశారు. అందులో ‘ట్రెండ్ మారినా… ఫ్రెండ్ మారడు’ అనే పాట స్నేహితులు పాడుకునే కొత్త పాటగా ట్రెండ్ సృష్టిస్తే… ‘వాట్ అమ్మా… వాట్ ఈజ్ థిస్ అమ్మా’ అనే పాట ప్రేక్షకుల చేత ‘సూపరమ్మా..’ అన్పించుకుంది. ఇప్పుడీ రెండు పాటల్ని ప్రేక్షకుల హమ్ చేస్తున్నారు. మిగతా పాటలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఈ శుక్రవారమే ఆ పాటల్ని విడుదల చేయనున్నారు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ రాక్‌స్టార్ అభిరామ్‌గా నటించిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాలోని పాటల్ని ఈ నెల 13న అంటే… శుక్రవారం విడుదల చేయనున్నారు. చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రామ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తోన్న ఐదో చిత్రమిది. ‘జగడం, రెడీ, శివమ్, నేను శైలజ’ సిన్మాలతో పాటు పాటలూ హిట్టే. మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఆ సిన్మాల్లో పాటలకు ఏమాత్రం తగ్గకుండా అంతకంటే అద్భుతమైన పాటల్ని ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం దేవిశ్రీ అందించాడు. అందులోనూ, ‘నేను శైలజ’ తర్వాత రామ్–కిశోర్ తిరుమల–దేవిశ్రీ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని దేవిశ్రీ మాంచి క్యాచీ ట్యూన్స్ కంపోజ్ చేశాడు. పాటలు ఎంత క్యాచీగా ఉన్నాయనడానికి ‘ఫ్రెండ్ మారినా ట్రెండ్ మారదు, వాట్ అమ్మా… వాట్ ఈజ్ థిస్ అమ్మా’ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ 13న పాటల్ని, థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేస్తాం. 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో రాక్‌స్టార్ రామ్ అయితే… సినిమా బయట మా రాక్‌స్టార్ దేవిశ్రీగారే. మ్యూజికల్ బేస్డ్ స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టు పాటల్ని అందించారు. సాంగ్ ఫర్ సాంగ్ అన్నట్టు కాకుండా, ప్రతి పాట సందర్భానుసారంగా ఉంటుంది. ఇక, సినిమా విషయానికి వస్తే…
అభిరామ్ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్ లైఫ్, కాలేజ్ తర్వాత లైఫ్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్‌గా రామ్ జీవించారు. పాత్ర కోసం బాడీ మేకోవర్ కావడంతో పాటు సరికొత్త సై్టల్‌లోకి మారారు. అతని నలుగురు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్ కనిపించనున్నారు’’ అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.