నేను శైలజతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. తనకు చాలా గ్యాప్ తరవాత హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమలతోనే మళ్లీ చేసిన సినిమా.. `ఉన్నది ఒక్కటే జిందగీ`. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ఈనెలాఖరున ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈలోగా ట్రైలర్ విడుదల చేశారు. అనుపమ పరమేశ్వరన్ ప్రశ్నలు అడుగుతోంటే, రామ్ సమాధానాలు చెప్పడమే ఈ ట్రైలర్ ప్రత్యేకత.
నీ ఫ్రెండ్స్‌లో నీకు నచ్చే విషయం ఏమిటి?
నచ్చని విషయం ఏమిటి?
ఫ్రెండ్‌కీ బెస్ట్ ఫ్రెండ్ కీ తేడా ఏమిటి?
ఫ్రెండ్‌కీ లవర్కీ తేడా ఏంటి?
నీకు నచ్చిన వాళ్లలో నువ్వు కోరుకొనేది ఏంటి?
– ఇలా సాగింది ప్రశ్నల పరంపర. ఇదేదో ట్రైలర్‌లా కాకుండా.. ఇంటర్వ్యూలా కట్ చేశారు. సమాధానాల్లో చాలా వరకూ కొటేషన్లే కనిపించాయి. మొత్తానికి స్నేహానికీ, ప్రేమకీ, జీవితానికీ అర్థం చెప్పే సినిమా ఇదన్న సంగతి అర్థం అవుతోంది. రామ్ లుక్ ఫ్రెష్‌గానే ఉన్నా – రామ్‌ని ఒక రకమైన గెటప్‌లో చూడ్డానికి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు ఈ ఫ్రెష్‌నెస్‌ని ఎంత వరకూ రిసీవ్ చేసుకొంటారో చూడాలి. వైజాగ్ బీచ్ అందాలు, డీఎస్పీ నేపథ్య సంగీతం ఈ టీజర్లో ప్లస్ పాయింట్స్. యూత్‌ని నచ్చేలానే కిషోర్ తిరుమల ఈ సినిమాని మలిచాడనిపిస్తోంది. మరి నేను శైలజ మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందో లేదో తెలియాలంటే ఈనెల 27 వరకూ ఆగాలి.