ఎన్నికల ప్రక్రియలో.. వీవీ ప్యాట్ స్లిప్పులను… ఒక్కో అసెంబ్లీని నియోజకవర్గం నుంచి.. ఐదు ఈవీఎంలకు సంబంధించిన స్లిప్పులు లెక్కించాలని.. సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంటే.. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో.. మొత్తం 35 పోలింగ్ బూత్ పరిధిలో.. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇప్పటి వరకూ.. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో.. ఒక్క వీవీ ప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తున్నారు. అసలు ఎక్కువ లెక్కించాల్సిన అవసరం లేదని… ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను.. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
భారత ప్రజాస్వామ్యం.. నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఓటంగ్ వ్యవస్థ మీద గతంలో పూర్తి స్థాయి నమ్మకం ఉండేది. రిగ్గింగ్ లాంటి వ్యవహారాలు జరిగినా.. కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈవీఎలు వచ్చిన తర్వాత.. బ్యాలెట్ వల్ల ఉన్న కష్టాలు పోయి.. కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అసలు ఓట్లు ఎవరికి పడుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీనిపై.. గెలిచిన పార్టీలు సైలెంట్‌గా ఉంటున్నాయి కానీ.. ఓడిపోయిన పార్టీలు.. పోరాటం చేస్తున్నాయి. ఒకప్పుడు.. ఈవీఎంలు వద్దే వద్దన్న బీజేపీ.. ఇప్పుడు ఈవీఎంలు కావాలంటున్నాయి. ఈవీఎంలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ వద్దంటోంది.
ఈ పరిణామాల మధ్య … ఓటు వేసి తర్వాత స్లిప్ వచ్చే పద్దతిని వీవీ ప్యాట్ మిషన్ల ద్వారా తీసుకు వచ్చారు. కానీ… అది చూసుకోవడానికే .. లెక్కించడానికి కాదని.. ఈసీ చెప్పడం వివాదాస్పదమవుతోంది. యాభై శాతం వీవీ ప్యాట్లు లెక్కించాల్సిందేనని 21 పార్టీలు .. సుప్రీంకోర్టుకు వెళితే … ఈసీ కుదరనే కుదరదని తేల్చింది. కానీ… రాజకీయ పార్టీల పోరాటంతో.. సుప్రీంకోర్టు.. కొంత ఊరటనిచ్చింది. అయితే… పోలయిన ఓట్లకు.. వీవీ ప్యాట్ స్లిప్పులకు.. ఈవీఎంలో ఉన్న ఓట్లకు.. తేడా ఉంటోంది. దీని వల్ల వివాదాలు తలెత్తున్నాయి.