‘ఛత్రపతి` హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు వినాయక్. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే బాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. `ఛత్రపతి`ని నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ సంస్థ.. ఇప్పుడు వినాయక్ తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ ధృవీకరించారు. ”ఛత్రపతి డబుల్ పాజిటీవ్ చూసిన… పెన్ స్టూడియోస్ నిర్మాతలు చాలా ఇంప్రెస్ అయ్యారు. వినాయక్ తో మరో సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తామన్నారు. వాళ్లతో కథా చర్చలు కూడా జరిగాయి” అని క్లారిటీ ఇచ్చారు.
హిందీ ఛత్రపతికి సంబంధించిన అప్ డేట్ కూడా బయటకు వచ్చేసింది. ”ఛత్రపతి షూటింగ్ పూర్తయ్యింది. హీరోయిన్ డేట్ల విషయంలో ఇబ్బందులు రావడం వల్ల సినిమా ఆలస్యమైంది. లేకపోతే ముందే పూర్తయిపోయేది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ముంబైలో జరుగుతున్నాయి. సీజీ కోసం మూడు నెలలు కేటాయించాలి. ఛత్రపతితో పోలిస్తే.. హిందీలో యాక్షన్ డోసు ఎక్కువగా ఉంటుంది. అయినా సరే.. వినాయక్ 80 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశార”న్నారు.