మహానటితో పూర్తి ఫామ్‌లోకి వచ్చేసింది వైజయంతీ మూవీస్. ‘దేవదాస్’ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగడంతో విడుదలకు ముందే ఈ సంస్థ టేబుల్ ప్రాఫిట్‌ని దక్కించుకుంది. ఈ ఉత్సాహంతోనే మరిన్ని కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించనుంది. దర్శకుడెవరన్నది త్వరలో తెలుస్తుంది. అలానే విజయ్ దేవరకొండతో రెండు సినిమాలు ప్లాన్ చేశారు. వాటికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయడానికి వైజయంతీ మూవీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్టీఆర్, విజయ్‌లలో ఆయన ఎవరికో ఒకరికి కథ సిద్ధం చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘అరవింద సమేత’తో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత… రాజమౌళి మల్టీస్టారర్ సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ మల్టీస్టారర్ ముగిసిన తరవాతే… వైజయంతీ మూవీస్ సినిమా ఉండబోతోంది.
వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన `దేవదాస్` ఈనెల 27న విడుదల అవుతుంది. నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.