‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రయాణం పూర్తిగా మారిపోయింది. అక్కడ్నుంచి ఒకొక్క అడుగూ వేసుకొంటూ స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచీ… వైజయంతీ మూవీస్తో మాత్రం తన అనుబంధం పెనవేసుకుపోయింది. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘మహానటి’లో విజయ్ దేవరకొండ ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ విజయంలో తన వంతు వాటా అందుకొన్నాడు. ఇప్పుడు ‘కల్కి’లోనూ విజయ్ ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించినట్టు టీ టౌన్ చెప్పుకొంటోంది. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ‘కల్కి’లో విజయ్ కనిపించబోతతున్నాడన్న విషయం దాదాపు ఖాయం అయ్యింది. అయితే అది గెస్ట్ రోలా, లేదంటే ఆ పాత్రకూ కథలో ప్రాధాన్యం ఉందా? అనేది తెలియాలి. ఇప్పటికే… ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి ఉద్దండులు ఉన్నారు. దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఇప్పుడు మరో ఆకర్షణ చేరినట్టే. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ధృవీకరించాల్సివుంది.