బాహుబలి సినిమా రెండవ భాగం షూటింగ్ పూర్తయిన తరువాత అందులో హీరో నటిస్తున్న ప్రభాస్ పెళ్లి చేసుకొంటానని చెప్పాడు. కనుక అతని మిత్రుడు రానా ఈరోజు ట్వీటర్ లో సరదాగా ఒక మెసేజ్ పోస్ట్ చేసాడు.
“బాహుబలికి వదువు కావలెను” అనే హెడ్డింగ్ పెట్టి దాని క్రింద ఇలాగ వ్రాసాడు. 36 ఏళ్ల వయసు గల గొప్ప యోధుడు మరియు సైన్యాధ్యక్షుడు మంచి కుటుంబం నుండి వచ్చినవాడు. ఎత్తు: ఆరు అడుగుల రెండు అంగుళాలు. మంచి దేహ దారుడ్యం కలిగి ఇంటి పనులలో బాగా సహాయం చేయగలడు. వివాహానికి తగిన అమ్మాయి కనబడితే కొండలు, గుట్టలు ఎక్కుతుంటాడు. అలాగని ఆడపిల్లల వెంటపడేవాడు కాదు. మేకప్ చేసుకోవడంలో చాలా శ్రద్ద కలవాడు కనుక పెళ్ళికూతురుకి తనే స్వయంగా మేకప్ చేయగలడు.
వదువుకి ఉండవలసిన లక్షణాలు: చాలా అందంగ ఉండాలి. అవసరమయితే కొండలు గుట్టలు ఎక్కగాలగాలి, అడవులలోకి వెళ్ళాలి. కత్తి యుద్ధం, విల్లు విద్య, మల్ల యుద్ద విద్యలలో వచ్చి ఉండాలి. ప్రస్తుతం కటిన కారాగార శిక్ష అనుభవిస్తున్న అత్తగారిని గౌరవించగలగాలి.