పార్లమెంట్ లో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు అంగీకరించింది. వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ముసాయిదాను మంత్రి కిరణ్ రిజీజు లోక్ సభ లో ప్రవేశ పెట్టగా… కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
వక్ఫ్ బోర్డులో మహిళలకు అవకాశం ఇవ్వటంతో పాటు 1995 నాటి ఈ చట్టానికి ఏకంగా 40 సవరణలను చేయాలని కేంద్రం భావించింది. ముస్లీం సమాజం నుండి వస్తున్న డిమాండ్స్ మేరకే ఈ కొత్త సవరణలను కేంద్రం తెలిపింది.
ఈ బిల్లును ముస్లీం లా బోర్డ్ ఎంతో కాలం నుండి వ్యతిరేకిస్తుండగా… లోక్ సభలో బిల్లును ఎంపీ కేసీ వేణుగోపాల్ తప్పుబట్టారు. ఇది రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఈ సవరణ బిల్లు మత విభేదాలకు తావిస్తుందన్నారు.
కొన్ని పార్టీలు సమర్థించగా, ప్రతిపక్ష కూటమి వ్యతిరేకించటంతో… ఈ బిల్లును జేపీసీకి పంపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ బిల్లు మళ్లీ సభ ముందుకు వచ్చే ముందు విస్తృత చర్చలు జరిపేందుకు వీలు కలుగుతుంది.