విజయసాయిరెడ్డి తండ్రి సుందరరామిరెడ్డి కూడా హంతకుడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఇటీవల విజయసాయిరెడ్డి ట్విట్టర్లో అత్యంత దారుణంగా బూతులు తిడుతూండటంతో దానికి పోటీగా రఘురామ కృష్ణరాజు కూడా అదే లాంగ్వేజ్ ప్రయోగిస్తున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి కుటుంబ చరిత్ర బయటపెడతానని సవాల్ చేశారు. దాని ప్రకారం ఇవాళ విజయసాయిరెడ్డి కుటుంబ చరిత్ర అంటూ..వారి తండ్రి గురించి వివరాలు వెల్లడించారు. రఘురామకృష్ణరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆయన తండ్రి హంతకుడు. ఎవరినో కాదు సొంత అన్ననే హత్య చేశాడు. అది కూడా మరో సోదరుడితో కలిసి సొంత అన్నను విజయసాయిరెడ్డి తండ్రి హత్య చేశారు. తాళ్లపూడి గ్రామంలో ఈ హత్య 1945లో ఈ హత్య జరిగిందని రఘురామ తెలిపారు.
విజయసాయిరెడ్డి తండ్రి పేరు సుందరరామిరెడ్డి. వారు తాళ్లపూడిలోనే ఉండేవారు. సొంత అన్నను మరో సోదరిడితో కలిసి హత్య చేసిన కేసులో సుందరరామిరెడ్డితో పాటు మరో సోదరుడికి.. ఉరిశిక్ష పడిందని రఘురామకృష్ణరాజు తెలిపారు. వీరికి సహకరించిన ముగ్గురికి యావజ్జీవ శిక్ష పడినట్లుగా రఘరామకృష్ణరాజు తెలిపారు. అయితే సుందరరామిరెడ్డి ఈ హత్యను బాగా ఎదిగిన తర్వాత చేయలేదు. మైనర్‌గా ఉండగానే చేశారు. అందుకే విజయసాయిరెడ్డి తండ్రి జైల్లో చదువుకున్నాడని రఘురామ చెబుతున్నారు. అందుకే విజయసాయిరెడ్డి జీన్స్‌లోనే క్రిమినల్ మనస్థత్వం ఉందన్నారు.
విజయసాయిరెడ్డి వేషం చూస్తే ఆయన డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చారని అనుకుంటారు. అయితే సొంత కుటుంబసభ్యులనే్ హత్య చేసిన దారుణమైన బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారని రఘురామ కృష్ణరాజు బయట పెట్టారన్న వాదన వినిపిస్తుంది. రఘురామ అబద్దాలు చెబుతూంటే విజయసాయిరెడ్డి వాస్తవాలను బయట పెట్టి ఆయనపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయవచ్చు. లేకపోతే.. ఎప్పట్లాగే బూతులు తిట్టి ఈగో శాటిస్ ఫై చేసుకునే అవకాశం ఉందంటున్నారు.