ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారులు ఆధిపత్య పోరాటంలో… ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవడానికి తమ అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజులుగా.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఉన్న అధికారాలన్నింటినీ… ఇటీవలే… జగన్‌కు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్..తనకు తానే ధారదత్తం చేసుకున్నారు. ఈ మేరకు బిజినెస్ రూల్స్ మార్చుతూ.. సంచలనత్మాక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంపై.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని.. ఇక తన వద్దకు రావొద్దని.. ఏమైనా ఉంటే… ముఖ్య సలహాదారు కల్లం అజేయరెడ్డి వద్ద మాట్లాడుకోమని ముఖం మీదనే చెప్పేశారన్న ప్రచారం.. సెక్రటేరియట్లో జరుగుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగనే.. కేబినెట్ సమావేశం… ఎల్వీని మరింతగా.. అవమానించేలా జరిగింది.
గత బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో… ఎజెండాలో లేని అంశాలున్నాయి. ఆ అంశాలను.. విధివిధానాలు పాటించకుండా కేబినెట్ అజెండాలో అంశాలు చేర్చారని.. సీఎస్‌కు కేబినెట్ భేటీ ప్రారంభమైన తర్వాతే తెలిసింది. దీన్నే అవకాశంగా తీసుకుని జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కు సీఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ కోరారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కేబినెట్ అజెండాలో అంశాలను ప్రవీణ్ ప్రకాష్ చేర్చారు. నిజానికి కేబినెట్ భేటీలో ఏయే అంశాలు రావాలన్నది.. సీఎస్ .. అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకుని ఎజెండా ఖరారు చేస్తారు. కానీ.. ప్రవీణ్ ప్రకాష్.. అసలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉనికి గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు కాబట్టి.. ఆయనే.. కీలకమైన అంశాలు రెడీ చేస్తున్నారు. దీంతో.. ఆధిపత్య పోరాటం ప్రారంభమయింది.
ఐదు నెలల కాలంలో.. అధికారులు ఎవరూ.. తమ తమ బాధ్యతల్లో కుదురుకోలేకపోయారు. అనేక సార్లు… బదిలీలు జరిగాయి. సీఎంవో అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. సీఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ తాము సీఎస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సెక్రటేరియట్లో జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ సీఎంవోలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ ఉండేవారు. తిరుమల ఆలయానికి సంబంధించి లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా ఆయన ఉంటారు. టీటీడీ నిధుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి… ఓ చిన్న స్థాయి అధికారితో విచారణ జరిపించారు. దీనిపై ప్రవీణ్ ప్రకాష్.. ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. కానీ.. నేరుగా ఆయనను.. సీఎంవోలోనే తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన… వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.