హైదరాబాద్: మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 6న ఈ రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. 9న కౌంటింగ్, ఫలితాలు ఉంటాయి. రేపటినుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 24వరకు గడువు ఉంటుంది. స్క్రూటినీని 25వ తేదీన నిర్వహిస్తారు. ఉపసంహరణకు 26 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. మరోవైపు ఈ రెండు కార్పొరేషన్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పురపాలక సంఘానికి కూడా ఇదే షెడ్యూల్లో ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ దాదాపుగా ఒక నెల రొజులకు పైగా రచ్చ రచ్చే.