తొమ్మిది నెలల పసికందుపై కనికరం లేకుండా అత్యాచారం చేసి.. హత్య చేసిన మృగాడికి.. ఈ భూమిపై నివసించే హక్కు లేదు. ఇది ప్రతి ఒక్కరి అభిప్రాయం. వరంగల్‌లో.. ప్రవీణ్ అనే కామాంధుడు.. చేసిన ఈ నేరం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కానీ.. ఆ ప్రవీణ్… కొన్నాళ్ల పాటు జైలుకెళ్లి బయటకు వస్తాడని.. అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. భారతీయ చట్టాలు.. అంత సామాన్యంగా.. శిక్షలు వేయవు. కఠిన శిక్షలు వేయనివ్వవు. విచారణ కూడా.. ఏళ్ల తరబడి సాగుతుంది. అందుకే.. ఆ నిందితుడ్ని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ ఆ అవసరం లేకుండా.. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. తీర్పు నెలన్నరోనే వచ్చేలా చేసి.. దేశం మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్నారు.
“వరంగల్ తీర్పు”లో పోలీసులే హీరోలు..!
కామాంధుడు ప్రవీణ్‌కు.. ఉరిశిక్ష విధించేలా.. న్యాయస్థానం ముందు.. సరైన సాక్ష్యాలు ప్రవేశ పెట్టడంలో.. పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. ప్రజల మన్ననలు పొందారు. సీసీ టీవీ ఫుటేజీ సేకరించి.. వాటిని పకడ్బందీ సాక్ష్యాలుగా.. కోర్టు ముందు ఉంచడంలో.. వరంగల్ పోలీసులు.. తమ ప్రత్యేకత చాటారు. ఎక్కడా.. వాదనల్లో.. తేడా రాకుండా… కచ్చితంగా… ఉరిశిక్ష విధించాల్సినంత.. ఘోరమైన నేరం చేశారని.. రుజువు చేయడంలో.. పోలీసులు తమ ప్రతిభ అంతా చూపారు. ఫలితంగా.. దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీర్పును.. నెలన్నరలోనే వచ్చేలా చేయగలిగారు. చిన్నారులపై వేధింపులకు… పాల్పడేవారిని ఉపేక్షించబోమని… నేరుగా సందేశం పంపారు.
కామాంధులు నేరం చేయాలంటే భయపడేలా “వరంగల్ తీర్పు..”..!
మారుతున్న కాలమో… టెక్నాలజీ భూతం కారణమో కానీ.. దేశవ్యాప్తంగా ఇప్పుడు.. చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. చివరికి నెలలు నిండని పసికందుని కూడా.. వదిలి పెట్టని కిరాతకులు తయారయ్యారు. దేశంలో.. ఏ మూల చూసినా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సభ్య సమాజం.. అలాంటి ఘటనలు బయటకు వచ్చినప్పుడు నివ్వెరపోతోంది. కానీ నిందితులకు శిక్షలు పడుతున్నాయా.. అంటే.. లేదు.. ఆ రాక్షసులు మళ్లీ.. ప్రజల్లోనే బతుకుతున్నారు. ఇంకెన్ని అఘాయిత్యాలు చేస్తారో తెలియదు. ఎన్ని బయటకు వస్తున్నాయో.. మరెన్ని.. మరుగున పడిపోతున్నాయో తెలియదు. ఇలాంటి పరిస్థితుల వల్లే.. దారుణాలకు పాల్పడేవారికి.. ధైర్యం వస్తుంది. కానీ.. వరంగల్ తీర్పు.. ఆ భయాన్ని పోగొట్టెలా ఉంది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే.. భూమిపై నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నిందితులకు గుర్తు చేసే పరిస్థితి తెచ్చింది.
దేశానికి ఆదర్శం “వరంగల్ తీర్పు..”..!
చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరిగిపోతూండటం వల్లే.. కేంద్రం పోక్సో చట్టంలో మార్పులు తెచ్చి.. ఉరిశిక్షను ప్రతిపాదించింది. ఇతి అత్యంత కఠినమైన చట్టం. కానీ.. దీన్నీ నీరుగార్చేందుకు… నిందితులకు అండగా ఉండే.. రాజకీయ నేతలు… ప్రయత్నాలు చేయక మానరు. ఇప్పటికే.. ఉత్తరాదిలో.. ఎంతో మంది రాజకీయ నేతలపై.. అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. అందరూ.. హాయిగా ఉన్నారు. బాధితులే.. కుటుంబాలను సైతం… పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో.. వరంగల్ తీర్పును.. దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుని అంతే వేగంగా.. కామాంధులపై.. శిక్షలు వేయగలిగితే.. మార్పు కచ్చితంగా వస్తుంది. నేరం చేయాలనుకునే వాళ్లను ధైర్యం పోగొడితే.. వచ్చే భయమే..నేరాలను తగ్గిస్తుంది.