వరంగల్ రెండో రాజధాని అనే అంశాన్ని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు అడ్డుకున్నా ఆగబోం అని తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ రెండో రాజధానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనల వెనుక అసలు రాజకీయం ఉందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ నే. రెండో రాజధాని అని ప్రకటించినా ప్రకటించకపోయినా …. వరంగల్‌కు ఆ స్టేటస్ ఉంది.
అయితే కొత్త రాజకీయంలో పండిపోతున్న కాంగ్రెస్ నేతలు వరంగల్ ను రెండో రాజధాని అని చెబుతూ ప్రజల్లో సెంటిమెంట్ రేపుతున్నారు. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఎయిర్ పోర్టు ఆపరేషన్లోకి తీసుకు రావాలని అనుకుంటున్నారు. మామునూరులో ఇప్పటికే ఉన్న ఎయిర్ పోర్టు ఆపరేషన్‌లో లేదు. దాన్ని కేంద్రం సాయంతో మళ్లీ ట్రాక్ మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత భూమి అవసరం అయితే సేకరించి ఇస్తున్నారు.
నల్లగొండ , వరంగల్, ఖమ్మం జిల్లాలలో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తే. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుమరుగు అవుతాయి. ఖమ్మంలో ఆ పార్టీకి పునాదులు కూడా లేవు. పదేళ్లు అధికారంలో ఉన్నా పార్టీని బలోపేతం చేసుకోలకేపోయారు. నల్లగొండలో కాంగ్రెస్ హవానే. ఉద్యమం వేడి ఉన్నప్పుడు మాత్రమే బీఆర్ఎస్ బలంగా కనిపించింది. ఇప్పుడు వరంగల్ ను కూడా రెండో రాజధాని పేరుతో పూర్తిగా బీఆర్ఎస్కు దూరం చేస్తారు. రేవంత్ సొంత జిల్లాగా మహబూబ్ నగర్ .. ఇతర జిల్లాలలో ఇతర వ్యూహాలు పాటిస్తే.. బీఆర్ఎస్కు అత్యంత గడ్డు పరిస్థితి రావడం ఖాయమని అనుకోవచ్చు.