బాహుబలి సినిమా కథ నచ్చిన ప్రేక్షకులు ఎంత మంది అంటే సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ తెరపైన రాజమౌళి క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ మేజిక్ మాత్రం అందరికీ నచ్చింది. బాహుబలి సినిమాలో కనిపించిన ప్రతిదీ ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్, వార్ సీన్స్….అన్నీ కొత్తగానే కనిపించాయి. అన్నింటికీ మించి తప్పనిసరిగా వెండితెరపైన మాత్రమే సినిమా చూడాల్సిన పరిస్థితి కూడా ఆ సినిమాకు భలే కలిసొచ్చింది. కానీ బాహుబలి-2కి అలాంటి ప్లస్‌లు పెద్దగా లేవు. అలాగే రుద్రమదేవి, శాతకర్ణిలాంటి సినిమాల ప్రభావం వళ్ళ బాహుబలి-2 మరీ కొత్తగా అనిపించే అవకాశాలు కూడా లేవు.
బాహుబలి సినిమాకి సంబంధించి రాజమౌళి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్స్ అన్నీ కూడా సెన్సేషనే క్రియేట్ చేశాయి. కానీ బాహుబలి-2కి మాత్రం ఆ మేజిక్ క్రియేట్ అవడం లేదు. రానా పోస్టర్ అయితే కార్టూన్ ఛానల్లో వచ్చే క్యారెక్టర్లా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు వచ్చిన ప్రభాస్-అనుష్కల స్టిల్ బాహుబలి సినిమా షూటింగ్ కాలం నాటిది అన్న విషయం తెలిసపోతూనే ఉంది. అంతకంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ని మించి అనే స్థాయిలో ఈ పోస్టర్స్ ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక బాహుబలి-2ని నిలబెట్టాల్సింది కథ, కథనాలు మాత్రమే. ఈ సారి రాజమౌళి డైరెక్షన్ మేజిక్ ఒక్కటే సరిపోయేలా అయితే కనిపించడం లేదు. మరి బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులందరికీ కూడా సెకండ్ హాఫ్ కథ ఏంటి అనేది కొంత అవగాహన ఉండే అవకాశం ఉంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ బంధనాల దృష్ట్యా ప్రేక్షకుల అంచనాలను రాజమౌళి అందుకోగలడా? బాహుబలి-2కి సంబంధించి ఇప్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ పుట్ ఏదీ కూడా అద్భుతః అనే స్థాయిలో మెప్పించలేకపోవడంతో రాజమౌళికి వార్నింగ్ బెల్స్ గట్టిగానే వినిపించి ఉండాలి. తెలుగు సినిమా డైరెక్టర్ అయిన రాజమౌళి బాహుబలి-2తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తే మాత్రం వరల్డ్ కప్ గెలిచినట్టే. ఇండియాలోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి-2 నిలుస్తుందనడంలో సందేహం లేదు. హార్డ్ వర్క్‌కి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకుంటున్న జక్కన్న విజువల్ వండర్ అలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా?