నటి శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది.. తనకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని,, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో నాగ బాబు దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంటూ తన ట్విట్టర్ లో ఆరోపించింది. తనకు ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీ దేనని ఆరోపించింది. ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే-
‘నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో నాగ బాబు దగ్గర నుండి, నాకు ఏమన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీ దే, ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం ‘
అలాగే పవన్ మీడియాతో చేస్తున్న పోరాటం పై కూడా శ్రీ రెడ్డి స్పందించారు. మీడియాతో ఎందుకు పెట్టుకుంటున్నారంటూ ట్వీట్ చేసారు –
“అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి ఒకే వీడియో ని అయిదు, ఆరు సార్లు ట్విట్ చేస్తున్నారు, ఎవరెవరో ఫొటోస్ ట్విట్ చేస్తున్నారు, మీరు ట్వీట్ చేసిన ఫొటోస్ లో ఉన్న వారి మిద దాడి చేయండి అని మీ ఫాన్స్ ని వుసిగోల్పుతున్నట్లుంది, పాపం మీ ఫాన్స్ ని మీరు అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీడియా ని బాయ్ కాట్ చేసే దమ్ము ఎవరికి లేదు, ఇది మీరు గుర్తించాలి, త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి, మీడియా వాళ్ళతో ఎందుకు సార్ గొడవలు పెట్టుకుంటారు”
\