పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పగులగొట్టింది తాను కాదని.. తాను అసలు ఆ కేంద్రం వద్దు పోలేదని విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తరపున జగన్ మీడియా ఎదుట వాంగ్మూలం ఇచ్చేశారన్న విషయం ఆయనకు ఇంకా తెలిసినట్లుగా లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి పిన్నెల్లిని పరామర్శించి జైలు ముందు స్పష్టంగా చెప్పాల్సినదంతా చెప్పారు.
పిన్నెల్లి తనకు ఓట్లు పడటం లేదని.. అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంగా ఈవీఎంను బద్దలు కొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని జగన్ తేల్చేశారు. అప్పుడే పిన్నెల్లిని ముంచేశారని సెటైర్లు పడ్డాయి. పిన్న్నెల్లి ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి అసలు తాను పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదని చెప్పేందుకు వెనుకాడటం లేదు. కానీ ఇటు జగన్ .. ఇటు పిన్నెల్లి విచారణలో చెబుతున్న విషయాలు చూస్తే… వీళ్లకు అసలు వ్యవస్థల మీద ఎంత గౌరవం.. నమ్మకం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
నేరం చేసిన వాళ్లు తాను చేయలేదనే చెబుతారు. కాకపోతే వీడియో సాక్ష్యాలు ఉన్నా సరే.. తాము చేయలేదని వాదించడానికి కొంత ప్రత్యేకమైన మానసిక స్థితి ఉండాలి అలాంటివి వైసీపీ నేతలకు దండిగా ఉంటున్నాయి. మాచర్లను చంబల్ గా మార్చుకుని అరాచకాలు చేసిన పిన్నెల్లికి … ముందు ముందు అసలు సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారు.