ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను.. బాపట్లలో ఉన్న హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఆ సంస్థకు విధులు, నిధులు అంతంతమాత్రమే. అసలు ఆయనను అమరావతిలో ఉంచకుండా తరిమేయడమే ఆశ్చర్యకరం. అంతే కాదు.. ఆయనను తన కంటే తక్కువ స్థాయి అధికారితో.. అదీ కూడా.. తాను షోకాజ్ నోటీసు ఇచ్చిన అధికారితోనే బదిలీ చేయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మానసికంగా దెబ్బకొట్టాలనుకుంటే.. ఎలా చేస్తారో.. ఈ ఘటనే నిరూపిస్తుందని.. అధికారవర్గాలు చెబుతున్నాయి.
తప్పు చేసిన ప్రవీణ్ ప్రకాష్‌తో.. ఎల్వీకి శిక్ష వేయించిన సీఎం..!
ప్రవీణ్ ప్రకాష్‌కు… ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేసిన షోకాజ్ అంశానికి ఓ ప్రాతిపదిక ఉంది. కేబినెట్ అంశాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రవీణ్ ప్రకాష్… ఎజెండాలో చేర్చారన్న విషయానికి.. ఎల్వీ వద్ద ఆధారాలున్నాయి. అధికారిక వ్యవహారాల ప్రకారం… అది కచ్చితంగా తప్పు. దానిపై చర్య తీసుకునే అధికారం సీఎస్ కు ఉంది. ఒక వేళ.. అలా నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన కేబినెట్ అంశంపై.. తర్వాత వివాదాలు తలెత్తితే… ముందుగా దోషిగా నిలబడాల్సింది సీఎస్సే. అందుకే.. అలాంటి ఇబ్బంది భవిష్యత్ లో రాకుండా.. ఎల్వీ సుబ్రహ్మణ్యం… తనకేమీ తెలియదని.. సాక్ష్యంగా ఉంచుకోవడానికైనా.. నోటీస్ జారీ చేయక తప్పలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తప్పు చేసిన వాళ్లకు ఎలివేషన్ ఇచ్చి సీఎం పంపిన సందేశం ఏంటి..?
ప్రవీణ్ ప్రకాష్ చేసింది నిబంధనలకు విరుద్ధం. దాన్నే ప్రశ్నిస్తూ.. సీఎస్ నోటీసులు జారీ చేశారు. అలాంటప్పుడు… సీఎం.. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించిన… అధికారులకు మద్దతుగా నిలబడాలి. కానీ..ఇక్కడ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయడం వల్ల … నిబంధనలను పాటించిన వారికి శిక్ష విధించి.. అతిక్రమించిన వారికి మద్దతుగా నిలబడినట్లయింది. ఇది అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. సీఎంవోలో ఉండే అధికారులు అయితే.. ఎలాంటి పనులైనా చేయవచ్చా.. వాటిని అడ్డుకుంటే… ఎవరిపైనైనా వేటు వేస్తారా.. అన్న చర్చ ఇప్పుడు… రాజకీయవర్గాల్లోనూ నడుస్తోంది.
టీడీపీ ర్యాగింగ్.. ఎల్వీకి మరింత క్షోభ..!
ఓ వైపు నమ్మిన జగన్మోహన్ రెడ్డి.. ఇంత అవమానకరంగా గెంటేస్తే.. మరో వైపు.. టీడీపీ సానుభూతి వ్యక్తం చేస్తూ సుతిమెత్తగా చేస్తున్న విమర్శలు.. ఎల్వీకి మరింత మానసిక క్షోభ మిగులుస్తున్నాయి. తమ పార్టీ అంతాన్ని చూడాలనుకున్న సీఎస్‌కు ఇలా జరగడం మంచిదని..టీడీపీ అనడం లేదు. కానీ… అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పక్షపాతంగా వ్యవహరిస్తే.. చివరికి ఎలాంటి పరిణామాలు వస్తాయో.. ఎల్వీనే ఉదాహరణ అంటూ.. చెప్పుకొస్తున్నారు. ఎల్వీపై సానుభూతి చూపిస్తున్నారు.