సీఎంగా ఉన్నప్పుడు జగన్ వరద ప్రాంతాల సందర్శనకు వెళ్తే.. మునిగిపోయిన పొలాల దగ్గర వేదిక ఏర్పాటు చేశారు. దాని మీదకు వెళ్లేందుకు రెడ్ కార్పెట్ వేశారు. చొక్క నలగకుండా వెళ్లి ఆ పొలాల్ని చూసి.. చేతులు పిసుక్కుంటూ జగన్ అక్కడినుంచి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. దీంతో స్టేజ్.. రెడ్ కార్పెట్ లేదు. అంతే కాదు నేరుగా బురదలోకి దిగిపోయారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని ఆ ఫోటోలను చూసిన వారంతా ఫక్కున నవ్వుకుంటున్నారు. కానీ ఇలాంటిపనుల వల్ల గతంలో ఆయన పనితీరు హైలెట్ అవుతోందని.. ప్రజల్లో మరింత చులకన అవుతున్నామని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు
ఇప్పుడు అడ్డం కాలేదా మాస్టారూ !
విపత్తు ప్రాంతాలకు నేను వెళ్తే అడ్డం.. అందుకే అక్కడకు వెళ్లను అని జగన్ … ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ప్యాలెస్ లోనే ముసుగుతన్ని పడుకోవడంపై వచ్చిన విమర్శలకు ఓ సారి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలోనే.. తాను విపత్తు ప్రాంతాలకు వెళ్తే అధికారులు తన చుట్టూ తిరుగుతారని ఇక ప్రజలకు ఎవరు సాయం చేస్తారని ఆయన వాదన. చేతకాని వాడు ప్యాలెస్ లో ఉన్నా.. ఫీల్డ్ లో ఉన్నా ఒకటే అని ఆయన స్క్రిప్ట్ రైటర్లు అనుకుని అలా రాశారేమో కానీ.. ఇంత చేతకాని.. చేవలేని సీఎంను ఎప్పుడూ చూడలేదని విపత్తుల సమయంలో ప్రజలు అనుకున్నారు.
సీఎంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో బాధ్యత మరిచిన వైనం
ఓ ముఖ్యమంత్రి అంటే మనిషి కాదు వ్యవస్థ. అధికర యంత్రాగం మొత్తానికి అధిపతి. ఆయనే తాను వెళ్తే అడ్డం అనుకునే మైండ్ సెట్ ఉంటే..ఇక వ్యవస్థ ఎలా పని చేస్తుంది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో యంత్రాంగం అంతా అలాగే పని చేసింది . రాయలసీమలో .. కడపలో వరదలొచ్చి మునిగిపోతున్న సమయంలో ఓ కేరళ కమ్యూనిస్టు ఎంపీ పార్టీ కార్యక్రమం కోసం కడప వచ్చారు. పరిస్థితి వరస్ట్ గా ఉంది.. ప్రభుత్వం ఎలా పని చేస్తుందో తెలుసుకుందామని కడప కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. అంతా ఫీల్డ్ కు వెళ్లారేమో … అనుకున్నారు. కానీ ఆయనకు తెలిసిందేమిటంటే ఆరోజు సెకండ్ సాటర్ డే…. హాలీడే అందుకే ఎవరూ రాలేదని. ఆ విషయం తెలుసుకుని ముక్కు మీద వేలుసుకున్నారు.
ఇప్పుడు మారి ఏం ప్రయోజనం ?
ఓ వైపు ప్రజలు చస్తున్నా…అదే క్రైసిస్ మేనేజ్మెంట్ చేశారు. చివరికి ప్రజలు వదిలించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తున్న తీరు.. చంద్రబాబు అందరితో పని చేయించుకుంటున్న వైనం చూసి… అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు. అంతా అయిపోయాక..ఇంటికి రెండు వేలు, కేజీ బంగాళాదుంపలు అని ప్రకటించే పాలన కన్నా… కంటికి రెప్పలా కాపాడుకునే పాలకుడు ఉండటం మంచిదని ప్రజలు అనుకుంటారు. జగన్ తీరుతో అదే అనుకునే పరిస్థితి వచ్చింది. అంతా జగన్ ఐదేళ్ల పాటు సీఎంగా చేసిన నిర్వాకమేనని.. ఆయనను నమ్ముకుంటే నిండా మునిగిపోతామన్న నిర్ణయానికి వస్తున్నారు.