పాతికేళ్లలో ప్రజలకు లక్ష కోట్లు మిగిల్చానని తాను చేసిన సంపద సృష్టి అదేనని జగన్ రెడ్డి చెప్పుకున్నారు. రూ.1750 కోట్లు ఆయన ఖాతాలో పడిపోయాయి కానీ.. ఏపీకి మాత్రం ఒక్కటంటే ఒక్క యూనిట్ కరెంట్ కూడా సెల్ నుంచి రావడం లేదు. ఎందుకంటే సెకీ ఈ ఒప్పందంలో ఏపీకి సరఫరా చేసే విద్యుత్ అదానీదే అయి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ అదాని పవర్ విద్యుత్ ఉత్పత్తిలోవెనుకబడిపోయింది. ఇంకా ముందుకు రాలేదు. పవర్ అందుబాటులో లేదు. అందుకే గత సెప్టెంబర్ నుంచి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్నా చేయడం లేదు.
కానీ ఆదాని గ్రూపు మాత్రం ప్రభుత్వం డెడ్ లైన్ గడువు పొడిగించిందని ప్రచారం చేసుకుంటోంది. మరో వైపు జగన్ చేసిన సంపద సృష్టి కారణంగా ప్రజలపై వరుసగా భారాలు పడుతూనే ఉన్నాయి. ఇంధన సర్దుబాటు చార్జీలు పదే పదే వేసి వెళ్లారు. గతంలో కరెంట్ లేదని అడ్డగోలుగా కొనుగోలు చేసి..ఇప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు. ఈఆర్సీ నుంచి గతంలోనే అనుమతులు తీసుకున్నారు. జగన్ తన హయాంలో ఏడు శాతం విద్యుత్ చార్జీలు పెంచారని లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఇంధన సర్దుబాటు చార్జీలు పెద్ద ఎత్తున విధించారు.
జగన్ రెడ్డి తాను సంపద సృష్టించేశానని.. చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబు చేసిన ధ్వంసం ఏమిటో ఆయన చెప్పాల్సి ఉంది. ప్రజా వేదిక లాంటి కట్టడాలు ఏమైనా కూల్చారా?. కనీసం ఆయన చేసుకున్న సంపద సృష్టి అయిన పార్టీ ఆపీసుల కోసం విలాసవంతమైన భవనాల నిర్మాణాల జోలికి కూడా వెళ్లలేదు కదా !. జగన్ రెడ్డి పాలన నిర్వాకాల నుంచి ప్రజల్ని కాపాడటానికి ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.