దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50వేలకు చేరుకువగా ఉన్నాయి. ప్రతీ రోజు.. అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 3875 కేసులు నమోదయ్యాయి. మరణాలు పదిహేను వందలు దాటిపోయాయి. ఇప్పటికి నలభై రోజులు లాక్ డౌన్ పూర్తయింది. అయినా పెరుగుతూ ఉండటంతో.. ఇక అందరికీ .. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. ప్రజలకు ఓ రియలైజేషన్ వస్తోంది. కరోనాతో కలిసి జీవించడం తప్ప.. మరో మార్గం లేదని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే చెబుతున్నారు.
కరోనాతో కలిసి మెలిసి ఉండాల్సిందేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెబితే సోషల్ మీడియా ట్రోలింగ్ చేసింది కానీ.. ఇప్పుడు అందరూ.. అదే అభిప్రాయానికి వస్తున్నారు. బయటకు వెళ్తే కరోనా వస్తుందని అందర్నీ ఇళ్లలో దాచి పెట్టడం ఇక ఎంతో కాలం సాధ్యం కాదని ప్రభుత్వాలు ఓ అంచనాకు వస్తున్నాయి. అందుకే.. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాను తరిమికొట్టలేమని.. ఇమ్యూనిటీ పెంచుకుని దానితో కలిసి జీవిచండాన్నే అలవాటు చేసుకోవాలని సలహాలిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. నిన్నటి వరకూ.. లాక్డౌన్ విషయంలో కనీస మినహాయింపులు ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు. కానీ కేసులు ఏ మాత్రం కంట్రోల్ కాకపోతూండటం… ప్రజలు ఇంకెంతో కాలం.. లాక్ డౌన్‌కు సహకరించే పరిస్థితిలేదని భావిస్తూండటంతో.. ఆయన కూడా.. ఇక సడలింపులు ఇచ్చారు. మద్యం దుకాణాలు తెరిచారు. కరోనాతో కలిసి జీవించడం అలావాటు చేసుకోవడం మినహా మరో దారి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రెస్మీట్లో అదే చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో… కరోనాను తరిమికొట్టడం సాధ్యం కాదని ఆయన అంచనాకు వచ్చారు. అందుకే.. వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ.. కరోనాతో జీవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత బయట పడుతున్న కరోనా కేసుల్లో దాదాపుగా 70 శాతం వారిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. కరోనాకు ప్రస్తుతం మందు కూడా లేదు కాబట్టి.. ఇమ్యూనిటీ పెంచే ఆహారం అందిస్తే వారికి నయమవుతోంది. వృద్ధులకు, చిన్నపిల్లలకు వస్తేనే ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో… వారిని జాగ్రత్తగా చూసుకుని.. మిగతా వారి జీవితంలో కరోనా భాగమైనా ఇబ్బంది లేదన్న అభిప్రాయానికి మెజార్టీ పాలకులు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
నిజానికి కరోనా పూర్తిగా అంతమైపోతుందని ఎవరూ అనుకోలేదు. కానీ దాని బారిన పడకుండా… చూసుకోవాలని మాత్రం అనుకున్నారు. లాక్ డౌన్ వల్ల విస్తరణ తగ్గిందని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కరోనా ప్రపంచం అంతా పాకిపోయింది.ఇప్పుడు దాన్ని లాక్ డౌన్ వల్ల కానీ.. ఇతర ప్రయత్నాల వల్ల కానీ.. తరిమికొటట్డం సాధ్యం కాదు. ఇతర వైరస్‌లలా.. అది మానన జీవితాల్లో భాగం అయిపోయిందనే అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే..జాగ్రత్తలు తీసుకోవడం తప్ప..మరో మార్గం లేదంటున్నారు. అందుకే రిలాక్సేషన్స్ ఇస్తున్నారు.