బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కొక్కకరు ఒక్కో కేసీఆర్ లా మారాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ లో చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఫామ్ హౌస్లో అప్పుడప్పుడు కొంత మంది నేతల్ని కలుస్తూ మాట్లాడుతున్న ఆయన తాజాగా రామగుండం నేతలను కలిశారు. వారిని ఉద్దేశించి ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ముూగినట్లుగా తెలంగాణ చుట్టూ ఇప్పుడు నేతలు మూగుతున్నాని.. తాను పదేళ్ల పాటు కాపాడుకుటూ వచ్చానని చెప్పుకొచ్చారు.
పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంల చిక్కుకుందని తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. పొత్తులు కూడా ఉండబోవని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదని.. తాము మాత్రం కూటమి లేకుండానే గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండిపోరన్నారు.
ఒకప్పుడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని తర్వాత ఇందిరాగాంధీ మోసం చేశారని .. చాలా విషయాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా తాను వెనకడుగు వేయలేదన్నారు. బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నించి విపలమయ్యారన్న ప్రచారం.. కాంగ్రెస్ కూటమి నేతృత్వంలో జరిగిన సమావేశానికి కేటీఆర్ వెల్లడం వంటి పరిణామాల నేపధ్యంలో కేసీఆర్ పొత్తులు ఉండవని ఉద్దేశపూర్వకంగా ప్రకటించడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.