ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది.
రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని.. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని ముందస్తు హెచ్చరికలు చేసింది. ఇప్పటికే పలు జిల్లాలో 43 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా…వాతవరణ శాఖ హెచ్చరికలతో రానున్న మూడు రోజుల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలోనూ ఈ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రాచలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. వృద్దులు , చిన్న పిల్లలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగుతో వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.