దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ కుమార్తె దగ్గుబాటి అష్రిత కు పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్‌కి అధిపతి అయిన ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని వెంకటేష్ అల్లుడ్ని చేసుకోబోతున్నాడు. ఈవారంలోనే రాజస్థాన్‌లో పెళ్లి జరగబోతోంది. పెళ్లికి దగ్గుబాటి కుటుంబానికి చెందిన అత్యంత సన్నిఃహితులు, టాలీవుడ్‌లోని కొంతమంది ముఖ్యమైన సెలబ్రెటీలకు మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌లో వివాహ ముందస్తు వేడుకలు మొదలైపోయినట్టు తెలుస్తోంది. సంగీత్ కోసం రానా, నాగచైతన్య, సమంత హంగామా చేయడానికి ప్రిపేర్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు మీడియాకు పొక్కకుండా దగ్గుబాటి కుటుంబం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. నిశ్చితార్థం కూడా గప్ చుప్‌గా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు. పెళ్లి తంతూ అలానే ముగించాలని భావిస్తోంది. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో ఘనమైన విందు ఇవ్వాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఈ విందుకు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలంతా హాజరవుతారని సమాచారం.