గుంటూరులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, మరో డాక్టర్ పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. ఎందుకంటే.. ఆ పెళ్లిని వధువు తండ్రి రాజకీయ ర్యాలీగా మార్చేశారు. ఇది. ఐపీఎస్ కుటుంబానికి నచ్చలేదు. ఇదేంటని ఇరువర్గాలు పోట్లాడుకోవడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే పరువు పోతుందని మళ్లీ మాట్లాడుకుని బుధవారం పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారు.
గుంటూరుకు చెందిన ఓ యువ ఐపీఎస్ అధికారి.. గుజరాత్ క్యాడర్ లో పని చేస్తున్నారు. అక్కడ ఓ జిల్లాకు ఎస్పీగా గా ఉన్నారు. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నేత కుమార్తె, డాక్టర్ అయిన యువతితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. ఆ కాంగ్రెస్ నేత పెళ్లికి వచ్చేటప్పుడు జనాలతో పాటు కాంగ్రెస్ జెండాలను కూడా తీసుకు వచ్చారు. పెళ్లికి వెళ్తూ అదేదో కాంగ్రెస్ ర్యాలీ అయినట్లుగా కాంగ్రెస్ జెండాలతో పెళ్లికి వెళ్లారు.
అసలే ఆయన గుజరాత్ లో ఎస్పీ. ఇక్కడ పెళ్లి కాంగ్రెస్ జెండాల కింద చేసుకున్నారని తెలిస్తే ఆయన కెరీర్ ఏం కావాలి..?. ఈ భయంతో ఏమో కానీ వరుడి తల్లిదండ్రులు, బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయితే ఆ కాంగ్రెస్ నేత మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరువర్గాలు పంతానికి పోవడంతో .. చివరికి పెళ్లి ముహుర్తం దాటిపోయింది. దాంతో పెళ్లి జరగలేదు. దీంతో పెళ్లి కుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లికి వరుడు విముఖత వ్యక్తం చేశాడు. దీంతో రాత్రంతా చర్చించుకుని మళ్లీ ..పెళ్లిని పెళ్లిలాగే చేసుకోవాలని ఫిక్సయ్యారు. చివరికిబుధవారం పెళ్లి చేయాలని అనుకుంటున్నారు.
ఈ రోజు అయినావారి పెళ్లి జరుగుతుందా లేదా అన్న టెన్షన్ బంధువుల్లో ఏర్పడింది. ఆ వధూవరులిద్దలి మధ్య అండస్టాండింగ్ ఉండటంతో ఈ పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ.. లేకపోతే అక్కడితో ఆగిపోయేదని సెటైర్లు వినిపిస్తున్నాయి. అయినా కుమార్తె పెళ్లిని రాజకీయం చేయాలనుకున్న ఆ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేకు బుద్ది లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.