పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద్ బోస్ రాజ్భవన్లో తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించుకున్నారు. నిజంగా అంత గొప్ప పని ఆయన ఏం చేశారంటే.. రెండేళ్లు పదవిలోఉన్నారు. రెండేళ్ల గవర్నర్ పదవిని అనితర సాధ్యమైన రీతిలో నిర్వహించినందుకు తానే విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకుని తానే ఆవిష్కరించుకున్నారు. ఆ విగ్రహానికి డబ్బులు పెట్టలేదని ఓ కాళాకారుడు ఇచ్చాడని రాజ్ భవన్ ప్రకటించుకుంది.
గవర్నర్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. మమతా బెనర్జీ సర్కార్ పై ఆయన చేయని దాడి అంటూ ఉండదు. అయితే రాజ్ భవన్లో పని చేసే మహిళా ఉద్యోగిపై అత్యాచారం చేసినట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ గా తనకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచారణ నుంచి తప్పించుకున్నారు. రాజ్ భవన్ లోకి పోలీసులు రాకుండా నిషేధించారు.
గవర్నర్ తీరుపై అన్ని చోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు . విగ్రహాన్ని ఆవిష్కకరించారు.. ఇక పూలమాలలు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ గవర్నర్ మాత్రం.. ఇలాంటి విమర్శల్ని పట్టించుకునే రకం కాదు. ఆయనను ఏరి కోరి బెంగాల్ గవర్నర్ గా నియమించిన బీజేపీ పెద్దలకు ఇది వినోదంగా ఉందేమో కానీ.. గవర్నర్ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకత. పెంచేలా చేస్తుంది.