అల్లు అర్జున్ సినిమా అంటే ఓ ఫ్యామిలీ ప్యాక్. హీరోయిజం ఉంటుంది.. వినోదం ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అన్నింటినీ మిక్స్ చేస్తూ ఓ లవ్ స్టోరీ ట్రావెల్ అవుతుంది. అలాగైతేనే బన్నీ సినిమా చూసినట్టు. రేసుగుర్రం మాస్ సినిమానే. కానీ.. అందులోనూ ఇవన్నీ ఉన్నాయ్. జులాయి కూడా అంతే కదా? అందుకే ఆ సినిమా హిట్స్ జాబితాలో చేరిపోయాయి. మరి.. సరైనోడు ట్రైలర్ చూస్తే మాత్రం అదిరిపడుతున్నారు. ఈ సినిమా మొత్తం హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా రేంజులో సాగబోతోందని ట్రయిలర్లోనే తెలిసిపోతోంది. బోయపాటికి యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం. వాటిని బాగా ఎలివేట్ చేస్తాడు కూడా. యాక్షన్, ఎమోషన్ రెండూ దంచి కొడతాడు. ట్రైలర్లో డైలాగులు, బన్నీ యాక్షన్ సీక్వెన్స్, ఆర్.ఆర్ చూస్తే… ఈ సినిమా మొత్తం ఇలాంటి సన్నివేశాలే ఉంటాయేమో అనిపిస్తోంది.
అయితే ఒక్క రొమాంటిక్ మూమెంట్, సరదా పంచ్ లేకపోవడంతో బన్నీ ని ఈ సినిమా మొత్తం ఇంతే సీరియస్ గా చూపిస్తాడా?? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ ట్రైలర్ మాస్ కి నచ్చింది సరే.. మరి ఫ్యామిలీ ఆడియన్స్ మాటేంటి? అని బన్నీ అభిమానులు బెంగ పెట్టుకొంటున్నారు. రిలీజ్‌కి మరో పది రోజుల సమయం కూడా లేదు. దాంతో చిత్రబృందం డైలామాలో పడినట్టు టాక్. ఓ కామెడీ ట్రైలర్, ఓ రొమాంటిక్ ట్రైలర్ రెడీ చేసే పనిలో పడ్డారట. అవి బయటకు వస్తే… తప్ప బన్నీ ఫ్యాన్స్‌కి ఈ టెన్షన్ తీరదు.