తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేయాలంటే వారు అందుబాటులో ఉన్నా సరే. అర్థరాత్రి వాళ్లు నిద్రపోయిన తర్వాత గేట్లు దూకి, తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేస్తారు. అది కోర్టులో నిలబడని కేసు.. కనీసం కోర్టు రిమాండ్ కు ఇవ్వని కేసు అయినా సరే భయపెట్టడానికి ఈ వ్యూహం అమలు చేస్తారు. సాగర్ డ్యాం పైనా అదే ప్లన్ ్మలు చేశారు. అర్థరాత్రి సాగర్ డ్యాం గేట్లు దూకారు. పదమూడు గేట్లు మా వాటా అని బారికేడ్లు అడ్డం పెట్టుకున్నారు. ఉదయం ఒకటి, రెండు గేట్లు కాస్త పైకి ఎత్తి బలవంతంగా నీల్లు వదులుకున్నారు. గేట్లు ఎత్తడానికి ఒంగోలు ఇరిగేషన్ ఇంజినీర్ ను పిలిపించారు. అయితే ఇలా గేట్లు ఎత్తగానే అలా తెలంగాణ అధికారులు కరెంట్ ఆపేశారు. దీంతో నీటి విడుదల ఆగిపోయింది.
అయినా సరే తాము ప్రత్యామ్నాయ కరెంట్ ఏర్పాట్లు చేసి నీళ్లు ఇస్తామని ఏపీ అధికారులు మీడియా ప్రతినిధులకు లీక్ ఇచ్చారు. కానీ అదేమీ.. ఫంక్షన్ కు పెట్టే లైటింగ్ కు సరిపోయే కరెంట్ కాదు. సాగర్ గేట్లు ఆపరేట్ చేయడానికి అవసరమయ్యే కరెంట్ కు ప్రత్యేక వ్యవస్థ కావాలి. దాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం కష్టమే. అసలు అడ్డగోలుగా గేట్లు ఎత్తేసుకుని రుబాబు చేసుకునేదానికి కృష్ణాబోర్డులు.. ఇతర వ్యవస్థలు.. ఎందుకు ? కోర్టులు ఎందుకు ?. అసలు ఓ ప్రభుత్వం ఇలా చేయడం ఏమిటన్నది అందరికీ వచ్చే డౌట్.
పోనీ నీటి వాటా కోసం అద్భుతంగా ఏమైనా పోరాడుతోందా అంటే.. కృష్ణా జలాల కేటాయింపులపై రివ్యూ చేయాలని కేంద్రం నిర్ణయిస్తే.. కిక్కురమనలేదు. ఒక్క మాట మాట్లాడటం లేదు. లేఖ రాయలేదు. మరి సాగర్ డ్యాంలో అడుగుబొడుగు ఉన్న నీటి కోసం ఎందుకు యుద్ధం ప్రారంభించినట్లు. లోగుట్టు జగన్‌కే ఎరుక . రాజకీయం కోసం రాష్ట్రాన్ని ఏమైనా చేయగల నేర్పు ఆయన సొంతం. ఆయన చెప్పింది చేసే అధికారులు ఉండటం ఆయన సౌలభ్యం.