తన కెరీర్లో ఎప్పుడూ లేనన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు త్రివిక్రమ్. దర్శకుడిగా ఆయనరేంజ్.. రోజు రోజుకీ పెరుగుతున్నా, సెట్లో త్రివిక్రమ్ బిహేవియర్, ఆయన చుట్టూ వాతావరణం కాస్త గుబులు గుబులుగానేఉంది. “అ..ఆ..” సినిమా కోసం కె.విశ్వనాథ్‌ని ఓ పాత్ర కోసం సంప్రదిస్తే.. ఆయన రోజుకి రెండు లక్షల పారితోషికం అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చాడు. నిజానికి విశ్వనాథ్ పారితోషికం రోజుకి రూ.50 వేలకు మించదు. అయితే విశ్వనాథ్ చేత రెండు లక్షలు డిమాండ్ చేయించింది.. త్రివిక్రమే అని ఓ రూమరు. అడిగినంత ఇవ్వనందుకు అలిగిన విశ్వనాథ్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. అదిగో అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆ తరవాత ఆర్ట్ డైరెక్టరు రాజీవన్ ని అర్థాంతరంగా తప్పించి మరొకర్ని రంగంలోకి దించాడు త్రివిక్రమ్. ఆర్ట్ డైరెక్టరుతో విబేధాలు తారా స్థాయికి చేరుకొన్నాయని, అందుకే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆర్ట్ డైరెక్టర్ని త్రివిక్రమే తొలగించాడన్నది మరో గాసిప్పు
తాజాగా కెమెరామెన్ నటరాజన్ కూడా ఈ టీమ్‌కి గుడ్ బై చెప్పేశాడు. మరో పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా నటరాజన్ హ్యాండివ్వడం చర్చనీయాంశంగా మారింది. “ఆయన కాల్షీట్లు అయిపోయాయి… అందుకే వెళ్లిపోయారు” అని అ ఆ టీమ్ చెబుతున్నా, అందుకు వేరే కారణం ఉందట. సెట్లో త్రివిక్రమ్ ప్రవర్తన, మాట తీరు నటరాజన్ తట్టుకోలేకపోయారని టాక్. ఎప్పుడూ లేని విధంగా త్రివిక్రమ్ సెట్లో ప్రవర్తిస్తున్నాడని, అందుకే టీమ్ బాగా ఇబ్బంది పడుతోందని టాక్. ఇప్పుడు నటరాజన్ స్థానంలో మరో కెమెరామెన్‌ని అర్జెంటుగా తీసుకొచ్చారు. వీళ్లే కాదు… కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా త్రివిక్రమ్ వైఖరి నచ్చక మధ్యలోనే డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. ఓ టాప్ దర్శకుడు, సినిమాల్లోనూ, బయటా నీతులు మాత్రమే మాట్లాడే ఓ మాటకారి ఇలా ప్రవర్తిస్తాడని ఎవ్వరూ అనుకోరు. మరి త్రివిక్రమ్‌కి ఏమైంది?? విజయం ఇచ్చిన అహంకారం.. నెత్తిమీద ఎక్కి కూర్చుందా, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్‌తో స్ట్రగుల్ అవుతూ దాన్ని సెట్లో చూపిస్తున్నాడా?? ఏమో ఆ సంగతి మాటల మాంత్రికుడికే తెలియాలి.