బీజేపీ మద్దతుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి లండన్ నుంచి రాక ముందే… జగన్ ఢిల్లీకి వెళ్లబోతున్నారని మోడీ, షాలతో కలవబోతున్నారని ప్రచారం చేశారు. వచ్చాక కూడా చశారు. కానీ ఇప్పటి వరకూ ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లలేదు. బీజేపీ మద్దతుతోనే అరెస్ట్ చేసినందున ఈ వివరాలు చెప్పడానికి వెళ్తున్నారని వైసీపీ నేతలు చెప్పుకున్నాయి. కానీ ఎందుకు ఆయన ఢిల్లీ టూర్ వెళ్లలేదో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ పెద్దలకు తెలుసో లేదో క్లారిటీ లేదు. జాతీయస్థాయిలో ఖండించలేదు. తెలుగు రాష్ట్రాల స్థాయిలో మాత్రం ఖండించారు. జగన్ రెడ్డి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున.. త నకు ఖచ్చితంగా మోడీ, షాలు అపాయింట్మెంట్లు ఇస్తారని అనుకున్నారు. అందుకే అలాంటి ప్రకటన చేశారు. అపాయింట్మెంట్ల కోసం జగన్ రెడ్డి మనుషులు ఢిల్లీలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దొరకలేదు. పార్లమెంట్ సమావేశాల్లో తమ మద్దతు కోసం అయినా బీజేపీ అడుగుతుందనుకున్నారు. కానీ అలాంటి సందర్భాలు కనిపించలేదు.
బీజేపీకి తెలిసే జగన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే… ఆయన కు ఫాయిదా ఏమీ ఉండదు. కానీ.. దేశవ్యాప్తంగా… ఇంకా ఇతర దేశాల్లో జరుగుతున్న నిరసనలు …తెలుగు వారి ప్రదర్శనలపై కేంద్రానికి నివేదికలు ఉంటాయి. అలాగే.. చంద్రబాబు అరెస్ట్ ద్వారా కనీస ఆధారాల్లేకుండా విధానపరమైన నిర్ణయంపై ముఖ్యమంత్రిని అర్థరాత్రి అరెస్ట్ చేయగలిగాలంటే.. ఇక దేశంలో రాజకీయ కక్ష సాధింపులు ఏ స్థాయిలో చేయవచ్చో దారి చూపించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ ట్రెండ్ కొనసాగితే.. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్ష పార్టీలను అంతం చేయడానికి.. భౌతిక నిర్మూలనకు కూడా వెనుకాడరన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు.. ఇంకా అపాయింట్ మెంట్లు ఖరారు కాకపోవడమే కారణం. ఢిల్లీ పెద్దలు ఎప్పుడు పిలుస్తారో చూడాల్సి ఉంది.