దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా సోమవారం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
రెండు రైలు ఒకదానికి ఒకటి డీకొనడంతో రైళ్లు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు కానీ, ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరగవచ్చునని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా రైలు ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వస్తున్నాయి.
రైలు ప్రమాదాలను నిలువరించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ్ ఎలా పనిచేస్తుందో కేంద్ర మంత్రి వీడియో ప్లే చేసి మరి చూపించాడు. అయినా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటుండంతో కవచ్ టెక్నాలజీ ఏమైంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ప్రతిష్టాత్మకమైన కవచ్ టెక్నాలజీ పని చేస్తుందా..? లేదా అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
కవచ్ లాంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి.? రైల్వే శాఖ భద్రత విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా..? లోకో పైలట్లకు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వాల్సిన అసవరం ఉందా..?అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.