నీదీ నాదీ ఒకే కథ’ తో ఆకట్టుకున్నాడు వేణు ఉడుగుల. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరవాత… వేణు ఓ లేడీ ఓరియెంటెడ్ కథ తయారు చేసుకున్నాడని, అందులో నటించడానికి సాయి పల్లవి ఒప్పుకుందని వార్తలొచ్చాయి. ఆ తరవాత… ఆ సినిమా గురించిన కొత్త సంగతులేం తెలియరాలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు దశలో ఉందట. మరో రెండు నెలలకు స్క్రిప్టు పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. నీదీ నాదీ ఒకే కథని 1980 బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా 1990 నాటి కాలంలో జరుగుతుందని వేణు చెబుతున్నాడు. “ఇదో పొలిటికల్ డ్రామా. కథానాయిక నేపథ్యంలో జరుగుతుంది. లవ్ స్టోరీ కూడా ఉంటుంది. రొమాంటిక్ ఉంటుంది. ఈసారి కాస్త కమర్షియల్ టచ్ ఇద్దామనుకుంటున్నా. నటీనటుల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్టు పూర్తయ్యాకే వాటి గురించి ఆలోచిస్తా“ అంటున్నాడీ యువ దర్శకుడు. సాయి పల్లవి ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉంది. వేణు కథ నచ్చినా కాల్షీట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాయి పల్లవి స్థానంలో మరో నాయిక వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.