ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను తాకట్టు పెట్టేసి ఇక కేంద్రం నుంచి రూపాయి సాయం అడగబోమని రాసిచ్చి తెచ్చుకున్న రూ. పది వేల కోట్లను రాష్ట్రం ఏం చేసిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి కేంద్రం ఎప్పుడైనా ఓ వెయ్యి కోట్లు ఇస్తే.. నిధులు సాధించామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ విచిత్రంగా ప్రభుత్వం చెప్పుకోలేదు. మీడియానే బయట పెట్టింది. ఆ తర్వాత తాకట్టు పెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. అయినా ప్రభుత్వం గుంభనంగానే ఉంది. ఇప్పుడు ఆ నిధుల్ని ఏం చేశారనేది కూడా బయటకు రావడం లేదు.
నెల నెలా జీతాలకే డబ్బులు చాలడం లేదు. దీంతో ఈ ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీలకు నిధులు అవసరం, అలాగేవచ్చే నెలలో అమ్మఒడి పథకానికి నిధులు అవసరం లేదు. ఈ రెండు పథకాలకు ఎలాలేదన్న పది వేల కోట్లకుపైగా నిధులు కావాలి. కేంద్రం వద్ద ఏపీని తాకట్టు పెట్టి తెచ్చిన నిధులతో ఈ రెండు పథకాలకు బటన్లు నొక్కవచ్చు. అయితే ఇంత వరకూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. రూ. పది వేల కోట్లలో అప్పటికే నాలుగు వేల కోట్లు వివిధ రుణాల కింద ఆర్బీఐ జమ చేసుకుందని.. మరో ఆరు వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉంటే.. రైతులకు రైతు భరోసా కింద .. నెలాఖరులో జమ చేయనున్నారని తెలుస్తోంది.
అంటే అమ్మఒడి కోసం మళ్లీ ప్రతి మంగళవారం బ్యాంకుల వల్ల వేలంలో పాల్గొనాల్సిందే. కేంద్రం రూ. పది వేల కోట్లు ఇచ్చిన వారం రోజుల తర్వాత ఆర్బీఐ వేలంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.రెండు వేల కోట్ల రుణాలను తీసుకు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇచ్చిన రుణపరిమితిలో సగం మొదటి నెలన్నరలోనే తీసుకున్నారు. అమ్మ ఒడి కోసం మిగతా మొత్తం కూడా కూడా తీసుకుని పంచేసే అవకాశం ఉంది. దుబారా ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఉపయోగడం ఉండదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పరిస్థితి అదే. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన వాటిని సైతం బటన్ నొక్కుడుకే వాడుతున్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అప్పుడేం విన్యాసాలు చేస్తారో చూడాల్సి ఉంది.