ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె.విశ్వనాథ్ బయోపిక్‌ని ఇటీవలే లాంఛంగా మొదలెట్టారు. రచయిత, దర్శకుడు జనార్థన మహర్షి… ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇది సినిమా కాదట. ఓ డాక్యుమెంటరీగా తీయబోతున్నార్ట. తెరపై నిజ జీవిత పాత్రలే కనిపిస్తాయని, విశ్వనాథ్ జీవితం, ఆయన ప్రయాణం మొత్తాన్ని డాక్యుమెంటేషన్ చేయడానికి ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అయితే.. కొన్ని సంఘటనల్ని మాత్రం దృశ్యరూపంలో తెరకెక్కిస్తారు. అక్కడ మాత్రం పాత్రలు, సన్నివేశాలు అవసరం అవుతాయి. ఓ రకంగా చెప్పాలంటే…ఇదో సెమీ డాక్యుమెంటరీ అని చెప్పాలి. ఈ బయోపిక్‌ని థియేటర్లలో విడుదల చేస్తారా, లేదంటే… ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తారా? అనేది ఇంకా తేలాల్సివుంది. ఈతరహా డాక్యుమెంటేషన్ తెలుగులో కొత్త. బెంగాలీలో ప్రముఖ రచయితలు, దేశభక్తుల కథలు ఇలానే డాక్యుమెంటరీలుగా ఆవిష్కరించారు. మరి తెలుగులో ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అవుతుందో చూడాలి.