ఆమధ్య శ్రుతిహాసన్ ఇంట్లో ఓ అగంతకుడు దూరి.. హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. శ్రుతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం, పోలీసులు ఆ అగంతకుడ్ని పట్టుకోవడం.. ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు నయనతారకూ సేమ్ టూ సేమ్ అలాంటి అనుభవమే ఎదురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార చెన్నైలోని కోయంబేడు అనే ప్రాంతంలో ఓ ఆపార్ట్మెంట్లో నివసిస్తోంది. మొన్నోరోజు రాత్రి… నయన తార ఇంట్లో ఓ అగంతకుడు ప్రవేశించి హల్ చల్ చేశాడని, ఈ ఘటనలో నయనతార కూడా స్వల్పంగా గాయపడిందని, ఇంతలో నయన సహాయకులు ప్రతిఘటించడంతో.. ఆ ఆగంతకుడు పారిపోయాడని తెలుస్తోంది.
అయితే ఈ విషయమై నయన ఇంత వరకూ ఎలాంటి ఫిర్యాదూ చేయకపోవడం విశేషం. ‘ఆ ఇంటికి వచ్చింది నయన స్నేహితుడే. వాళ్లిద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగి ఉండొచ్చు’ అనే టాక్ వినిపిస్తోంది. అయితే నయన సన్నిహిత వర్గాలు మాత్రం ‘అలాంటిదేం లేదు.. ఇదంతా ఓ పుకారు’ అని కొట్టిపారేస్తున్నాయి. మరి.. నయన ఇంట్లో ఏం జరిగింది? ఆ రహస్యం ఏమిటి? అనే సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.