కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి.. వారం రోజుల కిందట.. సీఆర్డీఏ అధికారులు అంటించిన నోటీసుల గడువు ముగిసింది. నోటీసుల్లో వ్యక్తం చేసిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వకపోతే కూల్చేస్తామని.. నోటీసుల్లో స్పష్టంగా చెప్పారు. వివరణ ఇచ్చినప్పటికీ.. నిబంధనలకు విరుద్దమైతే.. జేసీబీలు వస్తాయని… చెప్పకనే చెప్పారు. చంద్రబాబను కరకట్టపై నుంచి ఖాళీ చేయించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతూండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ప్రారంభమయింది.
మరో వైపు.. చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమానికి లింగమనేని రమేష్.. సీఆర్డీఏకు . సమాధానం పంపినట్లు తెలుస్తోంది. తమకు నోటీసులు జారీ చేసిన అధికారి… ఆ మేరకు… అధికారం లేదని… లింగమనేని రమేష్.. తన సమాధానంలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. తన భవనాలకు అన్నీ అనుమతులు ఉన్నాయని మాత్రం సమాధానంలో స్పష్టం చేసినట్లు.. సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. తన భవనానికి ఉన్న అనుమతల వివరాలు.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ల నకలు, భవనాల రెగ్యులరైజేషన్ కోసం.. కట్టిన చలానాలు అన్నీ.. నోటీసుకు సమాధానంగా పంపినట్లు చెబుతున్నారు. అవసరం అయితే.. సీఆర్డీఏ అధికారులను వ్యక్తిగతంగా కలిసి.. వివరణ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.
కరకట్టపై మొత్తం.. 21 భవనాలను సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసి.. వారం రోజుల పాటు గడువు ఇచ్చారు. వారం రోజుల్లో పదకొండు మంది మాత్రమే సమాధానాలిచ్చారు. మిగిలిన వారు కోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సమాధానాలిచ్చిన పదకొండు మంది కూడా.. తమ భవనాలకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. అవన్నీ సీఆర్డీఏ ఏర్పడక ముందు నిర్మించినవని.. అప్పట్లో ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయని చెబుతున్నారు. ఇప్పుడు.. చంద్రబాబు ఇంటి కూల్చివేతను ప్రారంభిస్తే.. అన్నింటినీ కవర్ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారనేదానిపై.. ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.