వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. రాజకీయ పార్టీని పూర్తిగా.. ఔట్ సోర్సింగ్ కు ఇచ్చేశారు. ఆ ఔట్ సోర్సింగ్ కంపెనీపై నమ్మకం పెట్టి.. అభ్యర్థులు, ఆర్థిక స్థోమత సహా.. మొత్తం చూసి… రాజకీయాలు చేసేలా… ప్రొత్సహించారు. కేవలం తాను తెర ముందు మాత్రమే కనిపించారు. ఈ ఔట్ సోర్సింగ్ కంపెనీ పేరు… ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అలియాస్ ఐ ప్యాక్. ఇది ప్రశాంత్ కిషోర్ అనే… వ్యక్తిది. బీజేపీ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆ పార్టీకి ప్రచార సేవలు అందించి.. ఆ తర్వాత వ్యూహాకర్తగా .. గెలిచే పార్టీలకు పని చేసి… పబ్లిసిటీ తెచ్చుకున్న ఈయన ఐ ప్యాక్‌ను… జగన్ పూర్తిగా నమ్మారు. అందుకే.. వైసీపీ ని అప్పగించేశారు. అయితే… సలహాలతో నడిచేది.. నడిపించేది కాదు.. ఐ ప్యాక్. ప్రతీ పని కృత్రిమంగా సాగుతుంది. అంతా డబ్బులతో సాగిపోతుంది.
సర్వేలు, సోషల్ మీడియా ప్రచారం, మౌత్ టాక్, ప్రత్యర్థులపై బురద చల్లడం, వాళ్లు ఓడిపోతున్నారనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, కులాలను రెచ్చగొట్టడం ఇలా.. బీహారీ మార్క్.. వ్యూహాలన్నింటినీ.. పీకే టీం పక్కాగా అమలు చేస్తుంది. అయితే.. అవన్నీ… ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయా.. లేదా .. అన్నది మాత్రం చెప్పలేం. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో.. వైసీపీకి 26వేల ఓట్ల మెజార్టీ వస్తుందని విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ టీడీపీ గెలుస్తుందని.. ఎవరూ నమ్మలేకపోయారు. అంత తీవ్రంగా ప్రచారం చేశారు. తీరా ఫలితం చూస్తే… టీడీపీ 27వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో.. అంతా మౌత్ టాక్కే తప్ప.. అసలు ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితి లేదని అప్పుడే అర్థమైంది. ఆ వ్యూహాన్ని మరింత ఉద్ధృతంగా ఈ సారి ఏపీ మొత్తం ఊపయోగించారు. దానికి కొన్ని వందల మందిని.. పీకే రిక్రూట్ చేసుకున్నారు. ఇక పేటీ ఎం బ్యాచ్ పేరుతో.. కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకున్నారు. వీరు సోషల్ మీడియాలో.. కామెంట్లు చేసి.. వైసీపీ గెలవబోతోందన్న టాక్ ను స్ప్రెడ్ చేయడానికి… ప్రత్యేకంగా నియమితులయ్యారు. వీరికి… ఎప్పటికప్పుడు పేటీం పేమెంట్లు అందాయి.
పీకే.. మొదట్లో.. వైసీపీ తరపున వ్యూహకర్తగా బాధ్యతలు తీసుకున్నప్పుడు.. రూ. 300 కోట్ల ఒప్పందం అన్న ప్రచారం జరిగింది. అప్పట్లో సర్వేలు, సలహాలకు మాత్రమే.. ఈ మొత్తం ఒప్పందం అని.. చెప్పుకున్నారు. రాను రాను.. వైసీపీలో ఐ ప్యాక్ బాధ్యతలు విస్తృతమయ్యాయి. ఒక్క సీనియర్ నేతకు కూడా… ఎలాంటి పని చెప్పలేదు. మొత్తం ఐ ప్యాక్ టీమే చూసుకుంది. ఆన్ లైన్ ప్రచారం దీనికి అదనం. వైసీపీ… ఒక్క వీడియో సాంగ్ ను ప్రమోట్ చేయడానికే..రూ. పదికోట్ల ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే.. ఆన్ లైన్ మీడియా మొత్తం.. హోరెత్తించారు. ఎలా చూసినా.. రూ. 500 కోట్ల వరకూ..నాలుగేళ్ల కాలంలో పీకే టీంకు… వైసీపీ చెల్లించిందన్న అంచనాలున్నాయి. కొసమెరుపేమిటంటే… ఐ ప్యాక్ టీం ..ఇక వైసీపీ పని అయిపోవడంతో… హైదరాబాద్ ఆఫీస్‌ను ఖాళీ చేసేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ లోటస్ పాండ్ సమీపంలోని భవనంలోనే కార్యాలయం ఉంది. ఇప్పుడు ఖాళీ చేసేశారు.