హైదరాబాద్: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించిన మాస్టర్ ప్లాన్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఇటీవల విడుదలైన బాహుబలి చిత్రంతో పోల్చారు. గ్రాఫిక్స్‌తో రూపొందించిన్ మాస్టర్ ప్లాన్ వీడియోద్వారా తొక్కిసలాట ఘటనను, ఓటుకు నోటు కేసును ప్రజలు మరచిపోయేలా చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాహుబలిలాగా అమరావతి సినిమాను చూపించి ప్రజలను మోసగించాలని సీఎమ్ ప్రయత్నిస్తున్నారని రోజా అన్నారు. ఈ సినిమాచూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో, ఓ సామాజికవర్గమో సంతోషించినా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని చెప్పారు. రాజధాని ప్రణాళికలో సామాన్యులకు, మధ్యతరగతివారికి చోటెక్కడ అని ప్రశ్నించారు.