విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం కేసీఆర్ విజయమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి ఇది ఎలా లాభమో అర్థం కావడం లేదు. అసలు కమిషన్ చట్ట విరుద్దమని..దాన్ని కొట్టి వేయాలని కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఎందుకు చట్ట విరుద్ధమో చెప్పుకోవడాని కన్నా కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడారని ఎక్కువగా వాదించారు. దీంతో హైకోర్టు కొట్టి వేసింది. దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా అదే వాదన వినిపించడంతో అయితే కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది
నిజానికి అసలు సుప్రీంకోర్టు నిర్ణయం కేసీఆర్ ఓ రకంగా షాక్. ఇప్పుడు మరో మాజీ న్యాయమూర్తిని కేసీఆర్ ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వాలు నియమించే విచారణ కమిషన్లపై బీఆర్ఎస్కు.. కేసీఆర్కు అసలు నమ్మకం ఉండదు. అలాంటప్పుడు మరో రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించినట్లు అవుతుంది. ఇప్పుడు కొత్తగా వేయబోయే కమిషన్ ను తప్పు పట్టే అవకాశం .. కోర్టులకు వెళ్లే అవకాశం ఇక ఉండదు. వచ్చే కమిషన్ మరింత కఠినంగా వ్యవహరిస్తే ఏం చేయాలన్నది ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ముందున్న టెన్షన్.
కేసీఆర్ సుప్రీంకోర్టు కు వెళ్లడం ద్వారా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారని భవిష్యత్ లో కమిషన్ పై న్యాయపోరాటం చేసే అవకాశం కూడా కోల్పోయారన్న వాదన వినిపిస్తోంది. ఇది ఏ మాత్రం.. కేసీఆర్ కు ఊరట కాదని.. బీఆర్ఎస్ లనేతలు సంబరాలు చేసుకునేంత మ్యాటర్ ఇందులో లేదంటున్నారు. ప్రభుత్వం కూడా కొత్త కమిషన్ ను నియమించడానికి వచ్చే సోమవారం వరకూ గడువు అడిగింది. అంటే.. ఈ లోపు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కంటే కఠినంగా వ్యవహరించే వారిని వెదుక్కుంటుంది. ఇది ఊరట ఎలా అవుతుంది ?