ఏపీ విషయంలో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వడమే కాకండా యుగపురుషునకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేందుకు ఏ సందర్భం వచ్చినా వదిలి పెట్టడం లేదు. తాజాగా శతజయంతి కాయిన్ ను విడుదల చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రోటోకల్ ప్రకారం జరిగిన కార్యక్రమానికి స్వయంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరితోనూ మాట్లాడారు. పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు కాబట్టి మ్యాటర్ కాదు.. కానీ చంద్రబాబుతోనూ ఆయన చాలా సేపు మాట్లాడారు.
ఏం మాట్లాడారన్న అంశంపై స్పష్టత లేదు కానీ.. రాజకీయ నేతలు కాబట్టి రాజకీయాలే మాట్లాడి ఉంటారని అనుకోవచ్చు. ఏపీ రాజకీయాల విషయంలో బీజేపీ స్ట్రాటజీ కొంత మారినట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి గతంలోలా సహకారం అందించే విషయంలో మెల్లగా దూరం జరుగుతున్నట్లుగా పరిణామాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రతి విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారు. కేంద్ర నేతలు స్పష్టమైన సూచనలు ఇవ్వడం వల్లే తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని పురందేశ్వరి నేరుగా చెబుతున్నారు.
వచ్చే ఒకటి, రెండు నెలల్లో కీలకమైన మార్పులు ఏపీ రాజకీయాల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. అంతర్గతంగా ఏదో జరుగుతుంది కానీ.. బయటకు తెలియడం లేదు కానీ… అటు టీడీపీ, వైసీపీ, బీజేపీ ప్రత్యేకమైన వ్యూహాలను అవలంభిస్తున్నాయి. ఎవరు ఎవర్ని ట్రాప్ చేయాలనుకుంటున్నారో రాజకీయ వర్గాలకూ అర్థం కావడం లేదని రాజకీయవర్గాలంటున్నాయి.