తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అమరావతి పర్యటనకు వచ్చారు. ఆ తర్వాత అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు విశాఖ పర్యటనకూ వచ్చారు. అప్పటి స్వాగతానికి ఇప్పటి స్వాగతానికి ఆయనకు తేడా తెలిసి ఉంటుంది. అప్పట్లో ఆయన.. సొంత పోలీసులను రక్షణగా ఏర్పాటు చేసుకుని రాలేదు. ఒంటరిగా వచ్చారు. ఆతిథ్యాన్ని పొందారు. అతిధిగా వచ్చారు కాబట్టి.. ప్రజల అదే రీతిలో అభినందించారు. కానీ.. ఇప్పుడు విశాఖలో ఏం జరిగింది. హైదరాబాద్లో వ్యాపార ప్రయోజనాలు కోరుకునే కొంత మంది పని గట్టుకుని.. యాడ్ ఏజెన్సీలతో మాట్లాడుకుని మరీ ఫ్లెక్సీలు పెట్టాల్సి వచ్చింది. ఆ ఫ్లెక్సీలు కూడా.. ఎయిర్ పోర్ట్ టు శారదాపీఠం అంతే. కొంత మంది ఇతర పార్టీల స్థానిక నేతలతో.. కొంత మందిని.. ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి.. ఘన స్వాగతం బలవంతంగా ఇప్పించగలిగారు. జై కేసీఆర్ నినాదాలు చేయించగలిగారు. కానీ.. ఆ నినాదాలు మొత్తం పెయిడేనని.. వచ్చిన వారి వ్యవహారశైలి చూస్తనే తెలిసిపోతుంది.
కేసీఆర్ గతంలో ఏపీ పర్యటనకు వచ్చిప్పుడు.. టీడీపీతో వైరం పెట్టుకోలేదు. చంద్రబాబుతో.. సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. దాంతో.. తెలుగు రాష్ట్రాల మధ్య.. ఎలాంటి పంచాయతీ లేని వాతావరణం ఉండేది. ఆ కారణంగానే అప్పట్లో ప్రజలు కేసీఆర్.. ఏపీకి వచ్చినప్పుడు…అతిథి మర్యాదలు చూపించారు. కానీ.. విశాఖకు వచ్చినప్పుడు… గతంలో వచ్చినప్పుడు.. వచ్చిన రియాక్షన్కు ఇప్పటి రియాక్షన్కు తేడా తెలిసి వచ్చింది. పరిటాల రవి కుమార్తె పెళ్లికి వెళ్లినప్పుడు… ఆయనతో మాట్లాడేందుకు నేతలు పోటీలు పడ్డారు. కానీ.. ఇప్పుడు ఒక్కరంటే.. ఒక్కరు కూడా ముఖం చూపించడానికి ఇష్టపడలేదు.
చివరికి భద్రత కోసం.. పోలీసుల్ని తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నికల్లో సెంటిమెంట్ పెంచడానికి.. ఎప్పుడైతే.. మళ్లీ ఆంధ్రా నినాదం ఎత్తుకున్నారో.. అప్పుడే కేసీఆర్ మరోసారి తన పలుకుబడిని ఏపీలో పోగొట్టుకున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. కుల సంఘాల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి.. లోపాయికారీగా మద్దతిస్తున్న పార్టీలు.. ఏదో కొంత ఫేవర్ చేసినంత మాత్రాన కేసీఆర్… తన గత పర్యటనలకు… ఈ సారి పర్యటనకు తేడా తెలుసుకోకుండా ఉండలేనంత… అమాయకపు రాజకీయ నాయకుడు కాదేమో..?