తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కథనాలను తీసేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయనే మీడియాకు చెప్పి హడావుడి చేశారు. కుల మీడియా అంటూ ఓ ట్వీట్ కూడా పెట్టారు. ఇంతకీ మీడియా ఏ చెప్పింది.. శాంతి భర్త చేసిన ఆరోపణలు.. శాంతి చెప్పిన విషయాలు.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలనే ప్రసారం చేసింది. మీడియా ప్రసారం చేసినవన్నీ నిజాలేనని ఆయన అంగీకరించారు కూడా.
శాంతి ఇంటికి వెళ్లి బిడ్డను ఆశీర్వదించానని.. తన ఇంటికి వస్తే వేడుక చేశానని.. ఆర్థిక సాయం కూడా చేశానని చెప్పారు. ఆయన కూతురిగా భావించి చేశారో మరో కారణంతో చేశారో … మీడియా చెప్పలేదు. శాంతి భర్త చెప్పిన వాటిని ప్రసారం చేసింది. అవన్నీ నిజాలేనని విజయసాయిరెడ్డి అంగీకరిస్తూ ట్వీట్ పెట్టినప్పుడు .. మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని ఏపీ హైకోర్టుకు కాకుండా ఢీల్లీ హైకోర్టుకు వెళ్లడం.. అక్కడ వాదనలేమీ జరగకుండానే తీర్పు వచ్చేసిందని చెప్పుకోవడం మాత్రం హైలెట్.
దువ్వాడ – శ్రీవాణి – దివ్వెల మాధురీ ఇష్యూతో విజయసాయిరెడ్డి ఎపిసోడ్ ప్రస్తుతానికి వెనుకబడింది. కానీ వైసీపీలో ఇంత మంది గ్రంథ సాంగులు ఉన్నారా అని ఆయన గురించి కూడా చెప్పుకుంటున్నారు. మీడియాలో తన కథనాలు ఉంటే.. ఎప్పటికైనా కనిపిస్తూనే ఉంటాయని ఆయన ఢిల్లీ హైకోర్టుకు పోయినట్లుగా ఉన్నారు. అయితే అవేమీ తప్పుడు కథనాలు కాదు కాబట్టి.. మీడియా సంస్థలు వాటిని తొలగించే అవకాశం ఉండదు. విజయసాయిరెడ్డి ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్లి ఉన్నట్లయిదే ఇంకా మంచి ఫలితం వచ్చేదని ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. మీడియాపై ఏడ్చే బదులు తనను తాను కరెక్ట్ చేసుకోవాలని సలహాలను సొంత నేతలు ఇస్తున్నారు.