విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబోలో `లైగర్` వర్క్ జరుగుతోంది. అది పూర్తి కాకుండానే `జనగణమన` ప్రకటించేశాడు. కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా ఉందని టాక్ బయటకు వచ్చింది. ఇందులో పూజా హీరోయిన్ కాదని, ఐటెమ్ సాంగ్ కే పరిమితం అవుతుందని వార్తలొస్తున్నాయి. అయితే.. ఇందులో ఏమాత్రం నిజం లేదని… పూజా పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. “జనగణమనలో.. పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో మరో మాట లేదు. ఆమె ఐటెమ్ సాంగ్ చేయడం లేదు. పూర్తి స్థాయి పాత్రోనే కనిపించబోతున్నారు. జూన్ రెండో వారంలో ముంబైలో `జనగణమన` షూటింగ్ మొదలు కానుంది. ఇందులో పూజా పాల్గొంటారు. విజయ్ దేవరకొండ – పూజా హెగ్డేలపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు“ అని పూజా సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎఫ్ 3లో ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది పూజా. ఆ పాటకు థియేటర్లో మంచి స్పందన వస్తోంది. బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశ పరిచినా.. ఎఫ్ 3 విజయవంతం అవ్వడంతో.. పూజా ఇప్పుడు రిలీఫ్ ఫీలౌతోంది.