జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్భర్ నిర్వహించారు. పులివెందులలో ఆయన అదే చేశారని నీలి మీడియా ప్రచారం చేసింది. ప్రజాదర్భార్ ఏమని చేస్తారు.. సమస్యలను పరిష్కరించమని అక్కడికక్కడ అధికారుల్ని ఆదేశిస్తారా అంటే.. ఆయన మాట వినేవారు ఇప్పుడు లేరు. ఆకలేస్తుంది అయ్యా.. ఓ పూట తిండి పెట్టమని అడిగితే.. మన ప్రభుత్వం వచ్చాక చేస్తాననే మనస్థత్వం. ఇంక ప్రజాదర్భార్ నిర్వహించి ఏం చేస్తారు. ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఒక్క సారి కూడా ప్రజాదర్భార్ పెట్టలేదు. ఓడిపోయాక పది రోజుల్లోనే వచ్చి ప్రజాదర్భార్ పేరుతో నాటకం ప్రారంభించారు.
ప్రజలు గెలిపించారు ఐదేళ్ల పాటు వర్క్ ఫ్రం ప్యాలెస్. ఎప్పుడైనా ప్రజల్ని కలుద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ప్రజల్ని పురుగులుగా చూశారు. ఓట్లు పొందడానికి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అడగడానికి జనం వస్తారేమో అని ప్యాలెస్ చుట్టూ 144 సెక్షన్, 30 అడుగుల ఎత్తున ఇంటి చుట్టూ ఇనుప కచ్చడాలు బిగించుకుని కూర్చున్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఐ ప్యాక్‌తో ఆర్టిస్టులను పెట్టుకుని డ్రామాలాడేవారు. అంతే కానీ నిజంగా ప్రజల్ని కలిసే ప్రయత్నమే చేయలేదు. ప్రజల్ని కలుస్తానని జిల్లాల పర్యటనకు వెళ్తానని ప్రతి సంవత్సరం మీడియాకు లికులిచ్చేవారు. కానీ ఇప్పుడా అవసరం కూడా లేదు.
పులివెందుల ప్రజాదర్భార్‌కు వచ్చిన వారిలో అత్యధికులు సమస్యలతోనే వచ్చారు. తమకు బిల్లులు ఇవ్వాలని … ఇప్పుడెవరు దిక్కని రోదించేవారే ఎక్కువ., వారందరికీ కోర్టుకెళదామని చెప్పి పంపించారు జగన్. అదా ఆయనను నమ్ముకున్న వారికి చేసే సాయం. బడా బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించారు..కానీ కింది స్థాయి క్యాడర్ కు కనీస బిల్లులు చెల్లించలేదని స్పష్టమవుతోంది . జగన్ చేసిన అడ్డగోలు తప్పిదాల్లో ఇవి ఒకటి.
ఓడిపోగానే పులివెందులకు వచ్చి ప్రజాదర్భార్ పేరుతో హడావుడి చేస్తే..ఏమీ ప్రయోజనం ఉండదని రాజకీయం చెబుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది… ఇప్పుడు చేతులతో పాటు ఆకులు కూడా కాలిపోయాయని వైసీపీ నేతలే సెటైర్లు వేసుకుంటున్నారు.